Dharmaram Road Accident Today : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి బస్టాండ్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రున్ని సమీప ఆస్పత్రికి తరలించారు.
లైవ్ వీడియో - బైక్ను ఢీకొట్టిన కారు - స్పాట్లో ఒకరు డెడ్ - ROAD ACCIDENT AT PEDDAPALLI
పెద్దపల్లి జిల్లా కటికనపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు - ఒకరు మృతి మరొకరికి గాయాలు
![లైవ్ వీడియో - బైక్ను ఢీకొట్టిన కారు - స్పాట్లో ఒకరు డెడ్ Road Accident At Peddapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-11-2024/1200-675-22837472-thumbnail-16x9-accident.jpg)
Published : Nov 6, 2024, 10:59 AM IST
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : బంజేరుపల్లి నుంచి కటికెనపల్లి వైపు స్వామి, ఆశయ్య అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్నారు. కరీంనగర్ నుంచి వేగంగా వస్తున్న కారు ఈ బైకును ఢీ కొట్టింది. దీంతో పెసరు స్వామి అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా ఆశయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఆశయ్యను ఆసుపత్రికి తరలించారు.
అనంతరం కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజ్ రికార్డయ్యింది. మరోవైపు విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతి చెందిన స్వామి ధర్మారంలోని ప్రధాన రహదారి పక్కన హోటల్ నిర్వహిస్తూ ఆర్డర్లపై తక్కువ ధరలకు భోజనాలు సరఫరా చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈయనకు ఇద్దరు కూతుర్లు కాగా పెద్ద కూతురు సింధుజ రెండేళ్ల కిందట ఆత్మహత్యకు పాల్పడింది.