Cabinet Sub-Committee Key Reference On SC Classification :ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. ఎస్సీ వర్గీకరణ, కులగణన, తదితర అంశాలపై మంత్రులు చర్చించారు. ఎస్సీ వర్గీకరణపై 1,082 వినతులు, సూచనలు వచ్చినట్లు మంత్రులు వెల్లడించారు.
'2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ' - క్యాబినెట్ సబ్ కమిటీ కీలక సూచన
ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కీలక సూచన - ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయం
Published : Oct 8, 2024, 7:04 PM IST
|Updated : Oct 8, 2024, 7:14 PM IST
పంజాబ్, తమిళనాడులో ఎస్సీ వర్గీకరణను అధికారులు అధ్యయనం చేశారని, జిల్లాల్లోనూ పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. ఉపకులాల వారీగా ఎస్సీల వెనకబాటును, ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటుందని, కమిషన్‌కు ఉపకులాల వారీగా ఎస్సీ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని నియామక బోర్డులను ఆదేశించారు. బీసీ సామాజిక, ఆర్థిక సర్వే, ఓటరు గణన డిసెంబరు 9లోగా పూర్తిచేయాలని సమావేశంలో మంత్రులు నిర్ణయించారు.