BRS Legislative Party Conference Today :తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీల అమలు, ప్రజాసమస్యలను లేవనెత్తడం ద్వారా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైంది. ఆ దిశగానే ఇవాళ గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షత ఆ పార్టీ శాసనసభా పక్షం సమావేశమైంది. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, లేవనెత్తిన విషయాలపై మార్గనిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగడం ఇదే మొదటిసారి. గతంలో జరిగిన సమావేశానికి అనారోగ్యం కారణంగా కేసీఆర్ హాజరు కాలేదు.
నా కుమార్తె జైళ్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? :బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ అనంతరం గులాబీ బాస్ కేసీఆర్ పలు విషయాలపై మాట్లాడారు. అందులో భాగంగానే కవిత అరెస్ట్‌పై స్పందించారు. రాజకీయ కక్షతోనే తన కుమార్తె కవితను జైల్లో పెట్టారని, సొంత కుమార్తె జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా? అని కేసీఆర్ అన్నారు.
తాను అగ్నిపర్వతంలా ఉన్నట్లు పేర్కొన్నారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవన్న ఆయన, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే తెలంగాణ సాధించామని తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే, బాగా ఎదుగుతారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కార్ పాలనపై పట్టు సాధించలేకపోయిందని, పాలనపై దృష్టి పెట్టకుండా బద్నాం చేసే పనిలో ఉన్నారని ధ్వజమెత్తారు.
BRS Legislative Council Leader Madhusudanachari :ఏడు నెలల రేవంత్ పాలనలోనే శాంతి భద్రతలు ఎందుకు అదుపుతప్పుతున్నాయని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై స్పందించిన గులాబీ దళపతి, ఎక్కడో ఉన్న వారిని నేతలను చేస్తే, పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారని ఆక్షేపించారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అన్నట్టు సమాచారం. కాగా రేపటి సభలకు శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారిని ప్రకటించారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - వైఎస్సార్సీపీ నేతల బెయిల్ పిటిషన్ వాయిదా
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసుల పహారా - కొనసాగుతున్న విచారణ - Madanapalle Fire Accident Incident