తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ - నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు

BRS Protest in Telangana : ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భారత్​ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. రాజకీయ దురుద్దేశంతో కవితను అరెస్టు చేశారని ఆ పార్టీ మండిపడింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, బీఆర్ఎస్​ను దెబ్బతీసేందుకే ఈ చర్యకు పాల్పడ్డారని ఆక్షేపించింది. కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించింది.

BRS MLC Kavitha Arrested in Delhi Liquor Scam Case
BRS Leaders Protest On MLC Kavitha Arrest

By ETV Bharat Telangana Team

Published : Mar 16, 2024, 7:43 AM IST

కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్

BRS Protest in Telangana :శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత (MLC Kavitha)వ్యవహారం భారత్ రాష్ట్ర సమితిలో కలకలం రేపింది. కవిత నివాసంలో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుగుతున్న సమయంలో పార్టీ అధినేత కేసీఆర్​తో (KCR) మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్​రెడ్డి, ఎంపీ సంతోశ్‌కుమార్ సమావేశమయ్యారు. జరుగుతున్న పరిణామాలను అధినేతతో చర్చించారు. అరెస్టు విషయం తెలియగానే నేతలందరూ ఆమె నివాసానికి వచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్టు చేస్తున్నారని ఈడీపై (ED)మండిపడ్డారు.

BRS Protest Against Kavitha Arrest :పదేళ్ల బీజేపీ పాలనలో రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం సర్వసాధారణంగా మారిందన్న కేటీఆర్ ఆరోపించారు. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ తొందరపాటు, దుందుడుకు చర్యలపై సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. 19న సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశం పరిగణలోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

BRS MLC Kavitha Arrested in Delhi Liquor Scam Case : రాజకీయ దురుద్దేశంతో, కుట్రతోనే కవితను అరెస్టు (MLC Kavitha Arrest) చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్, కేసీఆర్​ను నైతికంగా దెబ్బతీసి రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బతీయాలని కుట్ర పన్నారని ఆక్షేపించారు. ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయన్న హరీశ్‌రావు పోరాటాలు, నిర్బంధాలు, అక్రమ కేసులు తమకు కొత్తకాదని హరీశ్​రావు వ్యాఖ్యానించారు.

రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో మా ఎమ్మల్సీ సభ్యురాలైన కవితను అరెస్టు చేయడం జరిగింది. ఆమె అరెస్టు గురించి బీజేపీ నేతలు గతంలో పలుమార్లు మాట్లాడారు. ఇది బీఆర్ఎస్, కేసీఆర్‌ను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం. సుప్రీంకోర్టులో చెప్పిన మాటకు విరుద్ధంగా కవితను అరెస్టు చేశారు. మాపై కుట్రలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. మా పార్టీ ఉద్యమాల పార్టీ.ఇవేమీ మాకు కొత్త కాదు. కవిత అరెస్ట్​కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలి.- హరీశ్​రావు, మాజీ మంత్రి

'ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఎలా అరెస్టు చేస్తారు' - ఈడీ అధికారులతో కేటీఆర్‌ వాగ్వాదం

ఈ విషయంపై సుప్రీంకోర్టులో చట్టబద్దంగా పోరాడతామని, ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తామని హరీశ్​రావు తెలిపారు. కవిత అరెస్టుకు నిరసనగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు చేపట్టాలని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగానికి పాల్పడే పార్టీలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హరీశ్​రావు హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీలను లొంగదీసుకునేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని కవిత నిర్దోషిగా బయటకు వస్తారని మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ - దిల్లీకి తరలింపు

కవిత అక్రమ అరెస్టును సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం : హరీశ్‌రావు

ABOUT THE AUTHOR

...view details