తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీ మద్యం కేసు - ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు - kavitha Judicial Custody Extended - KAVITHA JUDICIAL CUSTODY EXTENDED

MLC Kavitha Judicial Custody Extension : దిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు వారం రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు మే 14 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ ఉంటుందని వెల్లడించింది. కాగా ప్రజ్వల్‌ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి తమ లాంటి వాళ్లను అరెస్ట్ చేయడం దారుణమని కవిత వ్యాఖ్యానించారు.

Delhi Liquor Case Update
MLC Kavitha Judicial Custody Extension (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 2:54 PM IST

Updated : May 7, 2024, 7:19 PM IST

MLC Kavitha Judicial Custody Extension in ED Case : మద్యం కుంభకోణానికి సంబంధించిన ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని దిల్లీలోని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం మరో వారం రోజులు పొడిగించింది. ఈడీ కేసులో ట్రయల్‌ కోర్టు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగియటంతో, కవిత అభ్యర్థన మేరకు ఆమెను నేరుగా కోర్టు ముందు హాజరుపరిచారు. మరోసారి కస్టడీని పొడిగించాలన్న దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం, కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 14వ తేదీ వరకు పొడిగించింది.

దీంతో అప్పటివరకు ఆమె తిహాడ్‌ జైలులోనే ఉండనున్నారు. కాగా కోర్టుకు హాజరయ్యే సమయంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజ్వల్‌ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి తమ లాంటి వాళ్లను అరెస్ట్ చేయడం దారుణమని కవిత వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నింటినీ గమనించాలని కోరుతున్నానన్నారు.

కవిత అభ్యర్థన మేరకు నేరుగా కోర్టులో హాజరు :జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న తనను కోర్టు విచారణ సమయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా ప్రవేశపెట్టేలా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని కోరుతూ కవిత చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి కావేరి బవేజా పరిగణనలోకి తీసుకున్నారు. ఇక మీదట కోర్టు విచారణ సమయంలో అవసరమైనప్పుడు ఆమెను ప్రత్యక్షంగా హాజరుపరచాలని దర్యాప్తు సంస్థల అధికారులను ఆదేశించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత జ్యుడిషియల్‌ రిమాండ్‌ నేటితో ముగుస్తుండడంతో ఆమెను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబ్బంది మధ్యాహ్నం 2 గంటలకు రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

BRS MLC Kavitha Denied Bail :దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్‌ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు సోమవారం నిరాకరించింది. తనపై దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆమె పెట్టుకున్న వేర్వేరు దరఖాస్తులను స్పెషల్‌ జడ్జి కావేరి బవేజా తిరస్కరించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఆర్డర్స్‌ వెలువరించారు.

దేశంలో సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద కవితను ఈడీ మార్చి 15న, సీబీఐ ఏప్రిల్‌ 11న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దిల్లీ మద్యం విధానాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి వీలుగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అగ్రనేతలకు ఆమె రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారన్నది దర్యాప్తు సంస్థల ప్రధాన ఆరోపణ.

దిల్లీ లిక్కర్‌ స్కాం కేసు అప్డేట్ :ఈ కేసులో ఆమె కీలక పాత్రధారి కాబట్టి బెయిల్‌ ఇవ్వొద్దని, దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆమె బయటికొస్తే సాక్షులు, సాక్ష్యాలను ప్రభావితం చేసే వీలుందని ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. మహిళగా, బీఆర్‌ఎస్ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్న ఆమెకు బెయిల్‌ మంజూరు చేయాలని కవిత న్యాయవాదులు కోరారు. ఆమె ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని అప్పీల్‌ చేశారు.

దిల్లీ లిక్కర్ స్కామ్ అప్డేట్ - ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరణ - SPECIAL COURT DENIES KAVITHA BAIL

'కవిత విచారణకు సహకరించలేదు - తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారు' - delhi liquor scam case updates

Last Updated : May 7, 2024, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details