BRS MLC Kavitha Judicial Custody Again :దిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha CBI Investigation) ఈడీ కస్టడీ నుంచి సీబీఐ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో శని, ఆదివారం రెండు రోజులు ఆమెను అధికారులు ప్రశ్నించారు. కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఈరోజు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరపరిచారు.
9 Days Judicial Custody Of Kavitha : ఈ సందర్భంగా కవితను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా, 9 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కవితను అధికారులు మరోసారి తిహాడ్ జైలుకు తరలించనున్నారు.
రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారు : అయితే కోర్టుకు వెళ్లే ముందు కవిత మీడియా (Kavitha on CBI Investigation)తో మాట్లాడుతూ బీజేపీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని అన్నారు. బయట కమలం పార్టీ వాళ్లు మాట్లాడేదే, లోపల అధికారులు అడుగుతున్నారని తెలిపారు. రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.