తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​పై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు - సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్​ - బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్​

BRS MLAs Walk out From Assembly Today : కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రాకుండా పారిపోయారని మాజీ సీఎం కేసీఆర్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్​ చేశారు.

Telangana Assembly Session 2024
BRS MLAs Walk out From Assembly Today

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 2:43 PM IST

Updated : Feb 14, 2024, 4:09 PM IST

కేసీఆర్​పై సీఎం రేవంత్ ఘాటు కామెంట్స్ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్​

BRS MLAs Walk out From Assembly Today: రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చ సందర్భంగా కాంగ్రెస్​ నాయకులు, బీఆర్ఎస్​ సభ్యుల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. ఈ క్రమంలో నల్గొండ సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​పై మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నాయకుల బుద్ధి మారలేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రాకుండా పారిపోయారని కేసీఆర్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy Speech on KCR IN Assembly: బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​పై రాజగోపాల్​ రెడ్డి విమర్శలు చేయగా, ఆ పార్టీ​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్​పై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్​ రెడ్డి స్పందిస్తూ నల్గొండ సభ(KCR Speech At Nalgonda Meeting)లో కేసీఆర్‌ వాడిన భాషపై చర్చిద్దామా అని సవాల్ విసిరారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత ్రిపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న ఓ నేత ఇలా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు.

మేడిగడ్డ కుంగిపోతే నీరు నింపడానికి అవకాశం ఉందా అని గత ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ నిలదీశారు. సాగునీటిపారుదల శాఖ కోసం పని చేసిన కేసీఆర్‌, హరీశ్‌రావుకు పెత్తనం ఇస్తామని తెలిపారు. మేడిగడ్డలో నీరు నింపడం, అన్నారం, సుందిళ్లకు నీళ్లు ఎత్తిపోసే బాధ్యతను అప్పగిస్తామని చెప్పారు. మేడిగడ్డ కుంగి, కుప్పకూలుతుంటే నీరు నింపడం ఎలా సాధ్యమని మండిపడ్డారు. కాళేశ్వరం మెుత్తం దెబ్బతిని రూ.94 వేల కోట్ల ప్రజా ధనం వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

శాసనసభలో కోరం లేదని బీఆర్ఎస్ అభ్యంతరం - కడియం, శ్రీధర్‌బాబు మధ్య డైలాగ్ వార్

Telangana Assembly Session 2024 : కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ సభకు వస్తే గురువారం సాయంత్రం వరకూ చర్చిద్దామన్నారు. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. అవినీతి బయటపడుతుందనే కేసీఆర్‌ ఫాంహౌస్‌కు వెళ్లిపోయారని ఆరోపిం చారు. ఈ ప్రాజెక్ట్​లోని దోపిడీలో జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రతిపక్ష నేత బాధ్యత నుంచి తప్పించుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను చంపాల్సిన అవసరం ఎవరికీ ఉందని తేల్చి చెప్పారు. సానుభూతి కోసం వీధి నాటకాలు అడుతున్నారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు, ప్రవేశపెట్టిన బడ్జెట్​కు పొంతనలేదు : కడియం శ్రీహరి

"చచ్చిన పామును చంపాల్సిన అవసరం మాకేం ఉంది. నిజాయితీ ఉంటే, అవినీతికి పాల్పడకపోతే కేసీఆర్‌ సభలోకి రావాలి. మేడిగడ్డలో వాస్తవాలపై చర్చిద్దాం. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లపై నిర్ణయం తీసుకునేందుకు కేసీఆర్‌ సభకు రావాలి, చర్చించాలి. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శ్వేతపత్రంపై చర్చలో ప్రతిపక్షం అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. కాళేశ్వరంపై ప్రత్యేకంగా సమయం కేటాయిస్తే చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం."- సీఎం రేవంత్‌రెడ్డి , తెలంగాణ ముఖ్యమంత్రి

BRS MLAs Walk out :అధికారం నుంచి ప్రతిపక్షంలోకి మారినా సదురు నాయకులకు బుద్ధి మారలేదని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. బలహీన వర్గాలకు చెందిన మంత్రి మాట్లాడితే కేటీఆర్‌ కూర్చోమని అన్నారని మండిపడ్డారు. మార్పు కోసమే ప్రజలు ప్రతిపక్ష హోదా కల్పించారని ఎద్దేవా చేశారు. రాజగోపాల్​ రెడ్డి, సీఎం రేవంత్​ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యాలపై బీఆర్​ఎస్​ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్(BRS Walk Out)​ చేశారు. వారు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ గులాబీ దళం అసెంబ్లీ నుంచి బయటకు వచ్చింది.

సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్​

ఇందిరమ్మ రాజ్యంపై కడియం శ్రీహరి విమర్శలు - తిప్పికొట్టిన కాంగ్రెస్ మంత్రులు

అసెంబ్లీ సమావేశాలు పొడిగించే అవకాశం - 16 వరకు ఉభయసభల భేటీ!

Last Updated : Feb 14, 2024, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details