BRS Lok Sabha Meetings 2024 :శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారానికి దూరమైన భారత్ రాష్ట్ర సమితి, సార్వత్రిక ఎన్నికల కోసం కసరత్తు కొనసాగిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలునిర్వహిస్తోంది. ఈనెల మూడో తేదీ నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు రెండు విడతలుగా జరగుతున్నాయి. ఇవాళ నల్గొండ నియోజకవర్గ భేటీతో సమీక్షలు ముగియనున్నాయి. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి దాదాపుగా వంద మంది చొప్పున ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్య నేతలు, ఇతర కార్యకర్తలను సమావేశాలకు ఆహ్వానించారు.
BRS Focus on Lok Sabha Elections 2024 :పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో (KTR) పాటు సీనియర్ నేతలు హరీశ్‌రావు, కేశవరావు, మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి వారితో సమావేశమవుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను తెలుసుకుంటూనే భవిష్యత్ కార్యాచరణపై సమావేశాల్లో దృష్టి సారిస్తున్నారు. ముఖ్య నేతలతోపాటు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు సమావేశంలో మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించడంతోపాటు సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదు - గట్టిగా పోరాడాల్సిందే : కేటీఆర్
పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదన్న అంశమే ప్రతి సమావేశంలోనూ ప్రధానంగా వ్యక్తమవుతోంది. అధికారాన్ని అనుభవించిన నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కమిటీలు కేవలం నామామాత్రంగానే తయారయ్యాయని, పూర్తిగా ఎమ్మెల్యే కేంద్రంగా కార్యకలాపాలు సాగడం వల్ల తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు.
ఆదివారం మల్కాజిగిరి నియోజకవర్గ సమావేశంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ప్రభుగుప్తా, ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన మణెమ్మ చేసిన ప్రసంగాలు నేతలను ఆకట్టుకున్నాయి. పార్టీ ఇంఛార్జ్‌లు అల్లుళ్ల పాత్రకు పరిమితం కారాదని అన్నారు. అధికారం, బాధ్యతలు అప్పగిస్తున్న అధిష్ఠానం, ఆ ఇంఛార్జులు పనిచేస్తున్నారో లేదో చూడాలని వ్యాఖ్యానించారు. సమావేశంలో కొంతమంది మాట్లాడుతుండగా మిగతా వారి నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వాటన్నింటినీ పార్టీ అధినేత కేసీఆర్‌కు (KCR) నివేదిస్తున్నారు.