తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడిగడ్డపై దుష్ప్రచారాన్ని ఆపి - వర్షాకాలంలోపు మరమ్మతులు చేపట్టండి : బీఆర్ఎస్ - KTR Visit Medigadda

BRS Leaders Visit Medigadda : కేసీఆర్​, గత ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని మాని, మేడిగడ్డకు వర్షాకాలంలోపు మరమ్మత్తులు చేసి పొలాలకు నీరందించాలని బీఆర్​ఎస్​ డిమాండ్ చేసింది. మేడిగడ్డ, అన్నారం ఆనకట్టలను సందర్శించిన బీఆర్​ఎస్​ బృందం పాక్షికంగా విజయం సాధించినట్లు పేర్కొంది. తమను దూషించినా, వేధించినా రైతుల కోసం భరిస్తామని వ్యాఖ్యానించింది. ఇది మొదటి పర్యటన మాత్రమే అని, కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని కాంపోనెంట్లను దశల వారీగా సందర్శిస్తామని బీఆర్​ఎస్​ తెలిపింది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 10:47 AM IST

కేసీఆర్, బీఆర్​ఎస్​పై దుష్ప్రచారాన్ని మానాలి - మేడిగడ్డ ఆనకట్టకు వర్షాకాలంలోపు మరమ్మత్తులు చేయాలి : కేటీఆర్​

BRS Leaders Visit Medigadda : రానున్న రోజుల్లో పంట‌లు ఎండిపోకూడ‌దంటే కామ‌ధేనువు వంటి కాళేశ్వరంను కాపాడుకోవాల‌ని బీఆర్​ఎస్​ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడిగడ్డ, అన్నారం ఆనకట్టలను పరిశీలించిన తర్వాత బీఆర్​ఎస్​ నేతలు అన్నారం వద్ద నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. మేడిగ‌డ్డలో కుంగిన మూడు పియర్స్‌ను స‌రి చేయ‌కుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న కేటీఆర్ (KTR), మొత్తం కాళేశ్వరం వృథా అయ్యిందని దుర్మార్గంగా ప్రచారం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. ఇది మొదటి పర్యటన మాత్రమే అన్న కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని కాంపోనెంట్లను సందర్శిస్తామని తెలిపారు.

'కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బట్టబయలు చేసేందుకే చలో మేడిగడ్డ పర్యటన'

రైతుల మీద, రాష్ట్రం మీద పగ పట్టకండి. కోపముంటే మా(బీఆర్​ఎస్​) మీద తీర్చుకోండి. అంతేకానీ 1.6 కిలో మీటర్ల బ్యారేజీలో​ 50 మీటర్ల వద్ద సమస్య ఉంటే, ఎప్పుడూ తప్పు జరగనట్టు దుష్ప్రచారం చేయడం సరికాదు. కడెం ప్రాజెక్టు కాంగ్రెస్​ హయాంలో కడితే, రెండుసార్లు కొట్టుకుపోయింది. సాగర్​, శ్రీశైలంలో లీకేజ్​ వచ్చింది. వాటిపై మేము ఎన్నడూ రాజకీయంగా మాట్లాడలేదు. నిపుణుల సలహాలు తీసుకొని, కుంగిపోయిన దాన్ని పునరుద్దరించండి. దిద్దుబాటు చర్యలు తీసుకోండి." -కేటీఆర్​, బీఆర్​ఎస్​ కార్యనిర్వహక అధ్యక్షుడు

BRS Leaders Fires On Congress: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై మాజీ మంత్రి కడియం శ్రీహరి పవర్ (Kadiyam Srihari) పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని, రీ డిజైనింగ్ ఆవశ్యకతను వివరించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు వస్తే, కాంగ్రెస్ నేతలు కౌంటర్‌ యాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) అద్భుతంగా ఉపయోగపడుతుందన్న కడియం, మరమ్మత్తులు చేసి రైతులకు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇవ్వవచ్చని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకుపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై కారులో ప్రయాణించిన ఆయన, కుంగిన పిల్లర్లకు మరమ్మతు చేస్తే కాళేశ్వరం ఫలాలను అద్భుతంగా పొందవచ్చని తెలిపారు.

'మేడిగడ్డ బ్యారేజ్‌లో కొన్ని పిల్లర్లు కుంగిపోతే - కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పోయినట్లు మాట్లాడుతున్నారు'

CM Revanth Reddy : విశ్రాంత ఇంజినీర్ల నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అబద్ధాలు చెప్పారన్న జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్, మేడిగడ్డ వద్ద ఆనకట్ట కట్టాలని సూచించారని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండి ఉంటే కాలయాపన చేయకుండా మరమ్మతులు చేపట్టడంతో పాటు యాసంగికి నీరు ఇచ్చేవారని తెలిపారు. నీరు తీసుకునేందుకు తెలంగాణకు మేడిగడ్డ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్న ఇంజినీర్ల ఐకాస అధ్యక్షుడు వెంకటేశం, కాళేశ్వరం ప్రాజెక్టు నభూతో న భవిష్యత్‌గా అభివర్ణించారు.

'చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తున్నారు' - మేడిగడ్డను సందర్శించిన బీఆర్​ఎస్​ నేతలు

పాలమూరు-రంగారెడ్డి నిధులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం : కాంగ్రెస్‌

ABOUT THE AUTHOR

...view details