BRS Leaders Meet on Lok Sabha Election 2024 : వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభలో పాల్గొన్న కేటీఆర్ అధికారంలోకి వచ్చినా రేవంత్‌రెడ్డి అనాగరిక భాష మారట్లేదని మండిపడ్డారు. 420హామీలతో గెలిచారన్న కేటీఆర్ కాంగ్రెస్ మాటల సర్కారే తప్ప చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారని వెల్లడించారు. లంకె బిందెల కోసం దొంగలు తిరుగుతారని రేవంత్ రెడ్డి పూర్వాశ్రమం అదెనేమో తనకైతే తెలియదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి లాగా తాము తిట్టగలిగినా సంస్కారం అడ్డొస్తుందని కేటీఆర్ వెల్లడించారు.
మార్పు అంటే ఇదేనా? తెలంగాణ ప్రయోజనాలు కేంద్రం చేతిలో పెట్టడమా : హరీశ్‌రావు
"కేసీఆర్ అయితేనే హైదరాబాద్, తెలంగాణ బాగుంటది. అభివృద్ధి గురించి ఇక్కడ ఓటు వేశారు. కానీ జిల్లాల్లో కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ ఇచ్చినా 420 హమీలు కొంతమంది మోసపోయారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వంమే చేతల ప్రభుత్వ కాదు. కేవలం బిల్డప్ ఇచ్చుకునే ప్రభుత్వం." - కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
కాంగ్రెస్ 420 హామీలు చూసి జనం మోసపోయారు - చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది : కేటీఆర్
BRS MLA Harish Rao Fires On Congress :కాంగ్రెస్ పార్టీ గోబెల్స్ ప్రచారంతోనే గెలిచిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పటాన్‌చెరులో మెదక్ నియోజకవర్గ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి హాజరైన హరీశ్ మార్పు అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమేనా అని దుయ్యబట్టారు. డిసెంబర్ నుంచి కరెంట్ బిల్లులు కట్టొద్దన్నారు కానీ ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లైనా రావన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలతో ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.