తెలంగాణ

telangana

ETV Bharat / state

బుచ్చమ్మది ఆత్మహత్య కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య : హరీశ్ రావు - Harish Rao Fires On CM Revanth

Harish Rao Fires On CM Revanth : హైడ్రా కూల్చివేతలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు గాంధీ ఆసుపత్రి వద్ద పరామర్శించారు. హైడ్రాపై, సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు జరిగాయని ధ్వజమెత్తారు. పేదలు కోర్టుకి వెళ్లలేరు అనే ధైర్యంతోనే కదా వారి ఇళ్లను కూల్చి వేస్తున్నారు అని హరీశ్​రావు ఆక్షేపించారు.

Harish Rao Fires On CM Revanth
Harish Rao Fires On CM Revanth (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2024, 6:09 PM IST

Updated : Sep 28, 2024, 6:42 PM IST

Harish Rao Comments On HYDRA : 'కూకట్​పల్లికి చెందిన బుచ్చమ్మది ఆత్మహత్య కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు జరిగాయని ధ్వజమెత్తారు. హైడ్రా వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ మార్చురీకి మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, కూకట్​పల్లి ఎమ్మెల్యే కృష్ణారావులు వచ్చారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కూల్చివేతలు కాదు నిలబెట్టడం నేర్చుకోవాలి :ఎవరికోసం ఈ మూసీ సుందరీకరణ? ఎవరికి మేలు చేసేందుకు ఈ కూల్చివేతలు అని హరీశ్ ప్రశ్నించారు.కూల్చివేతలు కాదు నిలబెట్టడం నేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ సూచించారు. వెంటనే హైదరాబాద్ ఎమ్మేల్యేలతో ఆఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి చర్యల వల్ల జరిగిన హత్యని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.

గాంధీ హాస్పిటల్​లో చిన్న చిన్న మందులకు రోగులు ఇబ్బంది పడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. పారాసిటమల్ మాత్రలు కూడా ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందన్నారు. గవర్నమెంట్ హాస్టళ్లలో, స్కూళ్లలో పురుగుల అన్నం పెట్టి విద్యార్థులను ఈ ప్రభుత్యం వేధిస్తుందని హరీశ్ ఆరోపించారు. హైదరాబాద్​కు ఉన్న పేరును నిలబెట్టేవిధంగా పని చెయాలని కోరారు. గత ప్రభుత్వాలు హయాంలో నిర్మాణాలకు అనుమతులను ఇచ్చారన్నారు.

Harish Fires On CM Revanth :30 ఏళ్ల నుంచి నివాసాలు ఏర్పరచుకున్న వారి ఇళ్లు కూల్చే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారని హరీశ్ రావు ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పేదలను నిర్వాసితులను చేస్తే ఇంటికి పరిహారం ఇవ్వాలని అన్నారు. కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని పేర్కొన్నారు. జీవన భృతి కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. ఉపాధి పోయి ఇల్లు పోయి ప్రజలు రోడ్డు మీదకు వస్తున్నారని ఆరోపించారు. పరిహారం ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం లేదని ఆరోపించారు.

ఇప్పటికైనా ఇలాంటి పనులు మానుకోవాలి :పరిహారం, ఉపాధి కల్పించిన తర్వాత వారిని ఒప్పించిన తర్వాతనే నిర్మాణాలను కూలగొట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు సహాయం చేస్తావా? లేక పేదలకు కన్నీళ్లు పెట్టిస్తావా అంటు ప్రశ్నించారు. 'ఇప్పటికైనా ఇలాంటి పనులు మానుకో' అని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. హైడ్రా మీద పోలీసు కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రంగనాథ్ పేదవాళ్ల ఇళ్లను రాత్రికి రాత్రి కూల్చివేస్తున్నారని ఆరోపించారు.

ఆత్మహత్య చేసుకోవద్దు ధైర్యంగా ఉండండి :'రేవంత్ రెడ్డి సోదరునికి నెల రోజుల ముందు పర్మిషన్ తెచ్చుకునే అవకాశం కల్పించారు. పేదవారి ఇండ్లను ఎందుకు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారు. పేదవారికి ఒక న్యాయం రేవంత్ రెడ్డి సోదరులకు ఒక న్యాయమా? పేదలు కోర్టుకి వెళ్లలేరు అనే ధైర్యంతోనే కదా వారి ఇళ్లను కూల్చి వేస్తున్నారు' అని హరీశ్ రావు దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి సోదరులు లాగానే అందరికి నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. దయచేసి ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు ధైర్యంగా ఉండండి జీవించి పోరాడాలని ఆయన ప్రజలను కోరారు. మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఎవరూ ప్రాణం తీసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేశారు.

'సోదరుడికి నోటీసులు ఇచ్చి, పేదల ఇంటికి బుల్డోజర్లా? - అఖిలపక్ష సమావేశం తర్వాత మూసీపై ముందుకెళ్లండి' - HARISH RAO MEET HYDRA VICTIMS

ప్రభుత్వానికి కూల్చివేత తప్ప పూడ్చివేత చేతకాదు : హరీశ్​రావు - Harish Rao Slams Congress Govt

Last Updated : Sep 28, 2024, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details