ETV Bharat / state

'తాను గర్భిణీ అనే విషయం - డెలివరీ అయ్యే వరకూ తెలియలేదు పాపం ఆ పిచ్చి తల్లికి'

మగ బిడ్డకు జన్మనిచ్చిన మతిస్థిమితం లేని మహిళ - పుట్టిన బిడ్డను పట్టుకుని పరిగెడుతుంటే ఎవరింటి శిశువునో పట్టుకొని పారిపోతున్నట్లు భావించిన స్థానికులు - చివరకు విషయం తెలుసుకుని బిడ్డను పెంచుకునేందుకు పోటీ

MENTALLY WOMAN GAVE BIRTH IN AP
Mentally Disabled woman Gave Birth in AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Mentally Disabled woman Gave Birth in AP : ఆమె ఏ ఇంటి ఆడబిడ్డో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆమెకు సుమారు 35 ఏళ్ల వయసు ఉండగా, మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. ఆంధ్రప్రదేశ్​లోని రాజమహేంద్రవరం గ్రామీణం శాటిలైట్‌ సిటీలో సుమారు రెండేళ్ల నుంచి ఓ ఆలయం వద్ద ఉంటూ యాచన చేసుకుంటుంది. అక్కడున్న స్థానికులు ఇచ్చే ఆహారాన్ని తింటూ జీవనం సాగిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఆమె గర్భవతి అయ్యింది. తాను గర్భిణీని అన్న విషయం కూడా అర్థం చేసుకోలేని స్థితి ఆమెది. ఈ నెల 15 ఉదయం ఆమె ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

Mentally Disabled woman Gave Birth in AP
పుట్టిన శిశువు (ETV Bharat)

బిడ్డును పెంచుకోవడానికి పలువురు ఆసక్తి : బిడ్డతో ఆమె పరుగు పెడుతుంటే అక్కడున్న స్థానికులు ఆమెను చూసి తొలుత ఎవరింటి శిశువునో తీసుకుని పారిపోతున్నట్లుగా భావించారు. అసలు విషయం తెలుసుకుని ఆమెపై జాలి పడ్డారు. అనంతరం ఆమె బిడ్డను చేరదీసి పాలు పట్టారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన పలువురు ఆ బిడ్డను పెంచుకోవడానికి ఆసక్తి చూపించారు. బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌బీ కానిస్టేబుల్‌ రామయ్యకు ఈ విషయం తెలియడంతో ఆయన ఛైల్డ్‌ లైన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఏపీ సచివాలయం సిబ్బంది, పోలీసుల సహకారంతో తల్లీబిడ్డలిద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరు ఆరోగ్యంగా ఉన్నారు.

ఆర్టీసీ బస్సులో పుట్టిన ఆ చిన్నారికి 'లైఫ్‌టైం ఫ్రీ బస్‌పాస్‌' - పురుడు పోసిన నర్సుకు బంపర్ ఆఫర్ - Lifetime Free Bus Pass For Baby

ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసిన మహిళా కండక్టర్ - అభినందించిన మంత్రి పొన్నం - PONNAM APPRECIATES LADY CONDUCTOR

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.