ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిద్దలూరులో విషాదం - విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి - BROTHERS DEAD IN ELECTRIC SHOCK - BROTHERS DEAD IN ELECTRIC SHOCK

Brothers Dead Due to Electric Shock in Giddalur: ప్రకాశం జిల్లా గిద్దలూరులో విద్యుదాఘాతంతో అన్నదమ్ములు మృతి చెందారు. ఓ శుభకార్యానికి ఆటోలో సప్లయర్స్ సామాన్లు తీసుకువచ్చి తిరిగి వాటిని తరలిస్తుండగా జరిగిందీ ఘటన. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

TWO BROTHERS DEAD IN ELECTRIC SHOCK
TWO BROTHERS DEAD IN ELECTRIC SHOCK (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 10:46 AM IST

Brothers Dead Due to Electric Shock in Giddalur:ప్రకాశం జిల్లా గిద్దలూరులో విషాదం చోటుచేసుకుంది. టాటా ఏస్‌ వాహనానికి విద్యుత్ వైర్లు తగిలి అన్నదమ్ములు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గిద్దలూరు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద జరిగిందీ ఘటన. మృతులు ముండ్లపాడు గ్రామానికి చెందిన శీలం లోహిత్, సాయిగా గుర్తించారు. ఓ శుభకార్యానికి ఆటోలో సప్లయర్స్ సామాన్లు తీసుకువచ్చి తిరిగి వాటిని తరలిస్తున్న సమయంలో ఆటోకు నీటి బోరుకు సంబంధించిన విద్యుత్తు వైర్ తాకింది.

రథోత్సవంలో విద్యుదాఘాతం- 15 మంది చిన్నారులకు గాయాలు - 11Children injured in Current shock

దీంతో విద్యుత్తు ఆటోకు సరఫరా కావడంతో షాక్​ కొట్టి ఆటోలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్ షాక్​కు గురైన వారిని కుటుంబ సభ్యులు స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

నెల్లూరు జిల్లాలో విషాదం - విద్యుదాఘాతానికి దంపతులు బలి - wife And husband current shock

ABOUT THE AUTHOR

...view details