తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలయ ప్రాంగణంలో చెత్త తొలగిస్తుండగా పేలుడు - పూజారికి తీవ్ర గాయాలు - EXPLOSION IN RANGAREDDY DISTRICT

ప్రజాపతి శ్రీశ్రీయాదేమాత ఆలయ ప్రాంగణంలో చెత్త తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు - ఘటనలో పూజారి సుగుణారామ్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Explosion In Laxmiguda Mailardevpally Area
Explosion In Laxmiguda Mailardevpally Area (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2024, 2:05 PM IST

Explosion In Laxmiguda Mailardevpally Area :రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్​పల్లిలోని పోలీస్​ స్టేషన్​ పరిధిలో పేలుడు కలకలం రేపింది. స్థానికంగా ఉన్న లక్ష్మీగూడలోని ప్రజాపతి శ్రీశ్రీయాదేమాత ఆలయం సమీపంలో చెత్తను తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పూజారి సుగుణారామ్​నకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏవిధంగా జరిగింది అనే దానిపై ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు గల కారణాలపై క్లూస్​టీం సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నట్లుగా ఏసీపీ శ్రీనివాస్​ వెల్లడించారు.

"ఈ రోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మైలార్​దేవ్​పల్లి పోలీస్ స్టేషన్​ పరిధిలో ఉన్న లక్ష్మీగూడలో శ్రీశ్రీ యాదేమాత ఆలయ ప్రాంగణంలో శుభ్రం చేస్తుండగా పేలుడు జరిగింది. దీంతో ఓ వ్యక్తికి గాయమైంది. ఈ ఘటన ఏవిధంగా జరిగిందనేది ఇంకా తేలాల్సి ఉంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం"- శ్రీనివాస్, ఏసీపీ

ABOUT THE AUTHOR

...view details