Blade Batch Hulchal at Vijayawada Bus Stand :విజయవాడ బస్టాండ్‌లో బ్లేడ్‌బ్యాచ్, యాచకులు వీరంగం సృష్టించారు. మద్యం తాగి రాత్రంతా బస్టాండ్‌లో ఉన్న బెంచీలను ఆక్రమించి, వాటిపై పడుకుంటూ రాకపోకల సాగించే ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పోలీసుల సాయంతో అధికారులు వారిని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.
అయితే అక్కడి నుంచి కదిలేది లేదంటూ వందమందికి పైగా యాచకులు ఒక్కసారిగా బ్లేడ్‌లతో ఆదివారం తెల్లవారుజామున దాడికి దిగారు. యాచకుల దాడితో పోలీసులు, ఆర్టీసీ అధికారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ దాడిలో ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వై.శ్రీనివాసరావు, పొరుగుసేవల సిబ్బంది సాంబయ్యకు, గాయాలు అయ్యాయి.
బెజవాడలో మళ్లీ బ్లేడ్ బ్యాచ్ హల్చల్.. అందరూ చూస్తుండగానే ఆర్టీసీ బస్టాండ్‌లో...