BJP Raghanandan Rao Comments on BRS MLAs Meeting :గతంలో బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానాలనే, నేడు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తోందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. కర్మ సిద్దాంతం ఎవరిని వదలదని, గతంలో చేసిన పనులకు నేడు అనుభవించక తప్పదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా ప్రోటోకాల్ పాటించని బీఆర్‌ఎస్ నేతలకు, నేడు ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
BJP Latest News :సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అండదండలతోనే బీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని(CM Revanth Reddy) కలిశారని బీజేపీ నేత రఘునందన్‌రావు(BJP) ఆరోపించారు. అనంతరం ప్రోటోకాల్ కోసమే కలిశామని ఎమ్మెల్యేలతో హరీశ్‌రావు బలవంతంగా ప్రెస్‌మీట్ పెట్టిచారని పేర్కొన్నారు. ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి లేదని, గతంలో మీరు ప్రోటోకాల్ పాటించారా? అని రఘునందన్ రావు నిలదీశారు.
గతంలో ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ప్రశ్నించినందుకు నియోజకవర్గ అభివృద్ధి కోసమే, అధికార పార్టీలోకి చేరుతున్నట్లు బదులిచ్చారని, నేడు అదే పరిస్థతి తలెత్తవచ్చని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి గుండు సున్నా తప్ప ఏమీ మిగలదని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి వచ్చిన ఫలితమే పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతమవుతుందన్నారు.
'కేసీఆర్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు - మా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే దావా వేస్తాం'
"సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అండదండలతోనే బీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. అనంతరం ప్రోటోకాల్ కోసమే కలిశామని ఎమ్మెల్యేలతో హరీశ్‌రావు బలవంతంగా ప్రెస్‌మీట్ పెట్టిచారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానాలనే, నేడు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తోంది. అధికారంలో ఉండగా ప్రోటోకాల్ పాటించని బీఆర్‌ఎస్ నేతలకు, నేడు ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి గుండు సున్నా తప్ప ఏమీ మిగలదు".- రఘునందన్ రావు, బీజేపీ నేత
హరీశ్‌రావు అండదండలతోనే సీఎం రేవంత్‌తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భేటీ అసలేం జరిగిందంటే.. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో పార్టీ మారుతున్నారనే అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని సదరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండించారు. కేసీఆర్‌ను, గులాబీ జెండాను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
తమ నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని, తమకు ఎస్కార్ట్ సరిగ్గా కేటాయించడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని, సంబంధిత అధికారులను కలిశామని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కేవలం కాంగ్రెస్ పార్టీకీ మాత్రమే సీఎం కాదని, అన్ని పార్టీల వారికీ ముఖ్యమంత్రేనని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తప్పా? అని ప్రశ్నించారు.
భారత్ మాల, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌లపై సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ