తెలంగాణ

telangana

ETV Bharat / state

బెల్​లో ఇంజినీర్​ అవుతారా? - నెలకు రూ. 40,000 వేతనం - చివరితేదీ ఎప్పుడంటే? - BEL RECRUITMENT 2024 BANGALORE

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్​లో 40 ఇంజినీర్‌ పోస్టుల భర్తీ - అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు అర్హులను ఎంపిక చేస్తారు

Engineer Job Recruitment In BEL
Engineer Job Recruitment In BEL (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

Engineer Job Recruitment In BEL :బీటెక్​ చేసి ఇంజినీర్​ ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న యువతకు గుడ్​న్యూస్​. బెంగళూరులోని భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్(బెల్​) తాత్కాలిక ప్రాతిపదికన 40 ఇంజినీర్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల చేసింది. పోస్టుల సంఖ్య, అర్హత, వేతనం, దరఖాస్తు విధానం తదితర వివరాలు మీ కోసం.

మొత్తం ఉద్యోగాల్లో 5 ప్రాజెక్ట్‌ ఇంజినీర్ పోస్టులు, 35 ట్రెయినీ ఇంజినీర్‌ ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుకు ఏదైనా బ్రాంచితో బీఈ/ బీటెక్​ను పూర్తిచేసుండాలి. సాఫ్ట్‌వేర్‌/ ఐటీ విభాగంలో 2 ఏళ్ల అనుభవం ఉండాలి.

  • సీ++/ జావా/ పైతాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజస్‌ తెలిసినవారికీ, ఏఐ(ఆర్టిఫీషియల్​ ఇంటెలిజన్స్​) రంగంలో అనుభవం ఉన్నవారికీ ప్రాధాన్యమిస్తారు.
  • ట్రెయినీ ఇంజినీర్‌ ఉద్యోగాలకు సంబంధించి సీఎస్‌(కంప్యూటర్​ సైన్స్)/ ఐఎస్‌/ ఐటీ బ్రాంచ్‌లతో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ పూర్తి చేసుండాలి.

వయసు :ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 32 ఏళ్లు, ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టుకు 28 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్​ ఫీజు : ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుకు 400రూపాయలు + 18 శాతం జీఎస్టీ. ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టుకు 150 రూపాయలు + 18 శాతం జీఎస్టీ అదనం.

ఎంపిక విధానం :అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు అర్హులను ఎంపిక చేస్తారు.

1. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ : అభ్యర్థుల షార్ట్‌లిస్టును రూపొందించి రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. రాత పరీక్ష తేదీ, చిరునామా వివరాలను అభ్యర్థుల ఈమెయిల్‌కు తెలియజేస్తారు. రాత పరీక్షను 85 మార్కులకు ఉంటుంది.

  1. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు సెలక్ట్​ చేస్తారు. ఇంటర్వ్యూకు 15 మార్కులను కేటాయించారు.
  2. ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
  3. ముందుగా 3 ఏళ్ల కాలానికి ఉద్యోగంలో నియమిస్తారు. సంస్థ అవసరాలూ, అభ్యర్థి పనితీరూ ఆధారంగా మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంటుంది.

2. ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులు : ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష 100 మార్కులుకు ఉంటుంది. రాత పరీక్ష తేదీ తదితర వివరాలను అభ్యర్థుల ఈమెయిల్‌ ఐడీకి పంపుతారు.

  • రాత పరీక్షలో అభ్యర్థులు సాధించినటువంటి మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఈ వివరాలను సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
  • సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌/ టెస్టింగ్‌/ ఐటీ సపోర్ట్‌/ మెయింటెనెన్స్‌లో ఏడాది అనుభవం ఉన్నటువంటి వారికి ప్రాధాన్యమిస్తారు. అయినప్పటికీ ఫ్రెషర్లు కూడా అప్లై చేసుకోవచ్చు.
  • ముందుగా 2 ఏళ్ల కాలానికి నియమిస్తారు. పనితీరు ఆధారంగా ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌గా పదోన్నతి కల్పించి ఉద్యోగాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తారు.
  • టీచింగ్, ట్రెయినింగ్, రిసెర్చ్, ఆన్‌లైన్‌ వర్క్, ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్‌ వర్క్‌ల లాంటివాటిని ఉద్యోగానుభవంగా(ఎక్స్​పీరియన్స్​)గా పరిగణించరు.

వేతనం : ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు సెలక్ట్​ అయిన వారికి మొదటి ఏడాది నెలకు 40,000 రూపాయలు, రెండో ఏడాది రూ.45,000, 3వ ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది 55,000 రూపాయలు చెల్లిస్తారు.

ట్రెయినీ ఇంజినీర్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారకి మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో సంవత్సరం రూ.35,000, మూడో ఏడాది రూ.40,000 చెల్లిస్తారు.

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ :01.01.2025

వెబ్‌సైట్‌ : www.bel-india.in

బీటెక్​ చేసిన వారికి గుడ్​న్యూస్​ - ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ అవకాశాలు - మొదటి నెల నుంచి రూ.40వేల జీతం

డిప్లొమా, ఐటీఐ అర్హతతో BELలో జాబ్స్​- దరఖాస్తుకు లాస్ట్​ డేట్​ ఇదే! - BEL Recruitment 2024

ABOUT THE AUTHOR

...view details