Avoid These Common Kitchen Mistakes:ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండడంలో వంటగది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దానిని ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ, ప్రస్తుత రోజుల్లో చాలా మంది కిచెన్ శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అనారోగ్యాల్ని కొనితెచ్చుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ మిస్టేక్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సింక్‌ను శుభ్రంగా ఉంచుకోకపోవడం : మీరు తీసుకునే ఆహారం కలుషితంగా మారడంలో సింక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే అది శుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది. మీకు తెలియకుండానే కూరలు, ఇతర పదార్థాల్లోకి చేరతుంది. అప్పుడు వాటిని తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు సింక్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి.
స్పాంజ్లు మార్చకపోవడం : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. వంటపాత్రలను శుభ్రం చేసే స్పాంజ్లు నెలల తరబడి యూజ్ చేస్తుంటారు. కానీ, అది మంచిది కాదు. ఎందుకంటే అవి బ్యాక్టీరియా వ్యాప్తికి స్వర్గధామం. కాబట్టి తరచుగా వాటిని మార్చడం ముఖ్యం.
కత్తుల విషయంలో అజాగ్రత్తగా ఉండడం : కిచెన్‌లో కూరగాయలను కట్ చేయడానికి యూజ్ చేసే కత్తులను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. వాటిపై పురుగులు, కీటకాలు తిరుగుతుంటాయి. అప్పుడు కడగకుండా అలాగే యూజ్ చేస్తే ఆరోగ్య సమస్యలు రావొచ్చు. అందుకే కూరగాయలు కోయగానే వాటిని భద్రపర్చుకోవాలి.
ఫ్రిజ్‌ని శుభ్రం చేయకపోవడం :ఎక్కువ మంది చేసే మరో పొరపాటు ఏంటంటే.. రిఫ్రిజిరేటర్‌ను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం. ప్రస్తుత రోజుల్లో టైమ్ లేదనో, ఇంకేదో కారణం చేతనో నెలల తరబడి దాన్ని క్లీన్ చేయరు. ఫలితంగా అందులో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. మీరు స్టోర్ చేసే పదార్థాలపైకి చేరి కలుషితం చేస్తుంది. కాబట్టి కనీసం నెలకు ఒకసారైనా దానిని శుభ్రం చేసుకోవాలంటున్నారు నిపుణులు. అదేవిధంగా చాలా మంది ఫ్రిజ్‌ను సరైన ప్లేస్‌లో ఉంచరు. అది కూడా కిచెన్‌లో ఇబ్బందిగా మారుతుంది.
కిచెన్‌లో ఈగలు, కీటకాల సమస్య ఎక్కువగా ఉందా? - ఈ టిప్స్‌తో ఒక్కటి కూడా కనిపించదు!