Atchutapuram as a Hub for Green Hydrogen and Green Energy : గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీలకు కేంద్రంగా అచ్యుతాపురం ఆవిర్భవించనుంది. వాతావరణానికి ఎటువంటి హాని లేకుండా పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను నిర్మించేందుకు సీఎం చంద్రబాబు పూనుకున్నారు. ప్రణాళికాబద్ధంగా దీనిని పట్టాలెక్కించడానికి చర్యలు చేపడుతున్నారు. దేశ భవిష్యత్తు ఇంధన అవసరాలు తీరేలా దీనిని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది.
దావోస్‌లో జరిగిన సదస్సులో ప్రపంచ పారిశ్రామికవేత్తలకు పూడిమడక వద్ద నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను పరిచయం చేస్తూ చంద్రబాబు ప్రసంగించారు. దీంతో దీని ప్రాధాన్యం ఒక్కసారిగా విశ్వవ్యాప్తమైంది. ఇంధన, విద్యుత్తు సంస్కరణలో ముందుండే చంద్రబాబు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు లక్ష్యాలను ప్రపంచ వేదికగా వివరించి అందరినీ ఆలోచింపజేశారు.
సెజ్ పరిధిలో 1200 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అత్యంత పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును పూడిమడక వద్ద నిర్మించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల శంకుస్థాపన చేశారు. 25 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 35 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టు కోసం ఎన్‌టీపీసీ, ఏపీ జెన్‌కోలు రూ.1.85లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంతోపాటు రాష్ట్ర అవసరాలకు దీనిని నుంచి నేరుగా హైడ్రోజన్ తీసుకోవాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు ఏపీ జెన్‌కో నుంచి దీనిలో పెట్టుబడులు పెట్టిస్తున్నారు.
భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటు చేయండి - లక్ష్మీమిత్తల్‌ను కోరిన నారా లోకేశ్