తెలంగాణ

telangana

ETV Bharat / state

వారిని క్షమాపణ కోరిన జ్యోతిష్యుడు వేణు స్వామి - ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడి - ASTROLOGER VENU SWAMY APOLOGIZES

తెలంగాణ ఉమెన్ కమిషన్​కి బహిరంగంగా క్షమాపణ చెప్పిన జ్యోతిష్యుడు వేణు స్వామి - గతంలో నాగచైతన్య, శోభితల వివాహంపై కీలక వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి

Astrologer Venu Swamy publicly apologizes to Telangana Women Commission
Astrologer Venu Swamy publicly apologizes to Telangana Women Commission (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2025, 5:39 PM IST

Astrologer Venu Swamy Publicly Apologizes to Telangana Women Commission :తెలంగాణ ఉమెన్ కమిషన్​కి జ్యోతిష్యుడు వేణు స్వామిబహిరంగంగా క్షమాపణ చెప్పారు. నటుడు అక్కినేని నాగ చైతన్య, శోభితల వివాహ బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్​కు బహిరంగ క్షమాపణలు కోరారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారదకు రాతపూర్వకంగా లేఖను అందజేశారు. అసలేం జరిగిందంటే,

గతంలో నాగచైతన్య, శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని వేణు స్వామి జోష్యం చెప్పారు. ఇద్దరూ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పారు. వేణు స్వామి వ్యాఖ్యలపై తెలంగాణ ఉమెన్ కమిషన్​కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై వేణు స్వామికి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

ఉమెన్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణు స్వామికి మరొకసారి ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయానికి హాజరైన ఆయన తన వ్యాఖ్యలను ఉపసరించుకున్నట్లు తెలిపారు. ఉమెన్ కమిషన్​ను క్షమాపణ కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని వేణుస్వామిని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శారద హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details