తెలంగాణ

telangana

మణికొండ ప్రభుత్వ పాఠశాలలో- "ఆర్క్‌ సర్వ్" పదో వార్షికోత్సవ సంబురాలు - ARC SERVE Organisation

Arc Serve 10th Anniversary : ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆర్క్‌ సర్వ్‌, త‌న ప‌దో వార్షికోత్స‌వ సంబురాలను మ‌ణికొండ‌లోని జిల్లా పరిషత్‌ హైస్కూలు విద్యార్థుల‌తో క‌లిసి చేసుకుంది. పదోతరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బ‌హుమ‌తులు ఇవ్వ‌డంతో పాటు, ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు ఆర్ధిక సహాయం చేసింది. 2022లో మ‌ణికొండ జ‌ెడ్పీ హైస్కూలును ద‌త్త‌త చేసుకున్న‌ప్ప‌టి నుంచి ఆర్క్ సెర్వ్ సంస్థ త‌న సీఎస్ఆర్ కార్య‌క్ర‌మంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 5:57 PM IST

Published : Aug 12, 2024, 5:57 PM IST

ARC SERVE Organisation
Arc Serve 10th Anniversary (ETV Bharat)

ARC SERVE Organisation : ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆర్క్‌ సర్వ్‌, త‌న సీఎస్ఆర్ కార్య‌క్ర‌మంలో భాగంగా మణికొండ ప్రభుత్వ పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇవాళ సంస్థ ప‌దో వార్షికోత్స‌వ సంబురాలను పాఠశాల విద్యార్థుల‌తో క‌లిసి చేసుకుంది. పాఠశాలలో చదువుకుని మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బ‌హుమ‌తులు ఇవ్వ‌డంతో పాటు, ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు ఆర్ధిక సహాయం చేసింది.

ఈ పాఠశాలలో చదివి పదోతరగతిలో అగ్ర‌శ్రేణి ఫ‌లితాలు సాధించిన విద్యార్థులు డి. కుష్వంత్ ర‌ణ‌చంద్ర‌వ‌ర్మ (10/10), ఎస్. భార్గ‌వి (9.8/10), బాస‌ర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన ఎం. మిర్యామిల‌ను ఆర్క్ స‌ర్వ్ సంస్థ స‌త్క‌రించి, వారికి ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఈ సంద‌ర్భంగా ఆర్క్ స‌ర్వ్ సంస్థ సీఈఓ క్రిస్ బాబెల్ మాట్లాడుతూ, గ‌డిచిన రెండేళ్ల‌లో మణికొండ పాఠ‌శాల విద్యాప‌రంగా, మౌలిక వ‌స‌తుల ప‌రంగా ఎంతో పురోగ‌తి చూపుతోందన్నారు.,

పదోతరగతి ఫలితాలకు ఉపాధ్యాయులు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని, ప‌రీక్ష‌ల్లో మార్కులు బాగా వ‌స్తున్నాయ‌ని క్రిస్‌ బాబెల్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇక్క‌డ త‌ర‌గ‌తి గ‌దులను అప్‌గ్రేడ్ చేయ‌డంతో పాటు క్రీడామైదానాల‌నూ మెరుగుప‌రిచామ‌ని ఆయన తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొర‌త‌ను తీర్చేందుకు రూ. 8 ల‌క్ష‌ల విరాళం ఇస్తున్నామ‌ని, ఏడుగురు అద‌న‌పు ఉపాధ్యాయుల‌ను నియ‌మించనున్నట్లు తెలిపారు. 2022-23లో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు 182 మాత్ర‌మే ఉండ‌గా 2023-24లో అది 204కు పెరిగి, 10.78% వృద్ధి క‌నిపించింద‌న్నారు.

విద్యార్థుల ఆరోగ్యం విష‌యంలో ఆర్క్ సెర్వ్ సంస్థ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రుతుక్ర‌మ విష‌యంలో విద్యార్థినుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, శానిట‌రీ నాప్కిన్ల పంపిణీతో పాటు, నిర్మాణ్ సంస్థ స‌హ‌కారంతో కెరీర్ గైడెన్స్ కార్య‌క్ర‌మాలను కూడా నిర్వ‌హిస్తోంది. పిల్ల‌ల‌కు క్రీడా ప‌రిక‌రాలు, ఇత‌ర ప‌రిక‌రాలు అందిస్తోంది. ఈ కార్యక్రమంలో ఆర్క్ స‌ర్వ్ సంస్థ సీఈఓ క్రిస్ బాబెల్, ప్రొడ‌క్ట్ మేనేజ్‌మెంట్ ఈవీపీ మైఖేల్ లిన్, వైస్ ప్రెసిడెంట్, జీఎం అంబరీష్ కుమార్, హెచ్ఆర్ డైరెక్టర్ కరుణ గెడ్డం, ఫెసిలిటీస్, అడ్మినిస్ట్రేషన్ మేనేజర్, సీఎస్ఆర్ లీడ్ స్వాతి తిరునగరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్‌లో నాగ్‌ అశ్విన్‌ పర్యటన - స్వగ్రామంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి చేయూత - tollywood director Nag Ashwin

చిత్రం భలే విచిత్రం - 11 మంది విద్యార్థులకు ఏడుగురు టీచర్లు

ABOUT THE AUTHOR

...view details