తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజా గొంతుకై మోగిన నిలువెత్తు అక్షరసేనానికి అశ్రునివాళి' - AP Politicians Tribute to Ramoji Rao - AP POLITICIANS TRIBUTE TO RAMOJI RAO

AP Politicians Tribute to Ramoji Rao : రామోజీ రావు అకాల మరణం పట్ల ఏపీ రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. మీడియా రంగంలో రామోజీరావు సేవలను కొనియాడుతూ సంతాపం ప్రకటించారు.

AP Politicians Tribute to Ramoji Rao
AP Politicians Tribute to Ramoji Rao (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 4:00 PM IST

Andhra Pradesh Political Leaders Condolences Ramoji Rao :రామోజీరావు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ సంతాపం తెలిపారు. ఆయన మీడియో, వినోద రంగంలో నిష్ణాతుడని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారని కొనియాడారు. జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో ఎనలేని సేవలందించినందుకు గాను రామోజీరావును పద్మవిభూషణ్‌తో సత్కరించారని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు.

Ramoji Rao Passed Away : రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. ఆయన తెలుగు పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించారని చెప్పారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు జదన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Politicians Tribute to Ramoji Rao Demise : రామోజీరావు మరణంపై తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా గొంతుకై ప్రభుత్వాల మీద తన అక్షరమనే ఆయుధంతో పోరాటం చేసి, యావత్‌ దేశ ప్రజల మన్ననలను పొందారని గుర్తు చేశారు. అక్షరయోధుడు రామోజీరావు అస్తమయం పట్ల టీడీపీ సీనియర్ నేత కనక మేడల రవీంద్ర కుమార్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంతాపం తెలిపారు. దిల్లీలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పాత్రికేయ, సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారన్న కనకమేడల, రామోజీ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

‍రామోజీరావు లెజెండ్ అని ఆయన అస్తమించడం దేశానికి నష్టమని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన పార్థివదేహానికి కావూరి సాంబశివరావు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శ్రీరామ్ నివాళులర్పించారు. తమ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయమని సునీత, శ్రీరామ్ ఆవేదన వ్యక్తంచేశారు. రామోజీరావు మరణం తెలుగు ప్రజలకి తీరని లోటని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రామోజీరావు మరణం పట్ల తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడు దిగ్భ్రాంతి తెలియజేశారు. ప్రతి తెలుగింటితో ఆయనకు ఉన్న అనుబంధం విడదీయలేనిదని కోనియాడారు. ప్రతి తెలుగు గడప ఒక కుటుంబ సభ్యున్ని కోల్పోయిందన్నారు. రామోజీరావు ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు.

రామోజీరావు కృషికి నిరుపమానం - ఆతిథ్యరంగ సంస్థల్లో ప్రముఖ స్థాయిలో డాల్ఫిన్ హోటళ్లు - Dolphin Hotels History

ABOUT THE AUTHOR

...view details