తెలంగాణ

telangana

ETV Bharat / state

హైకోర్టు ఆదేశాలు బేఖాతర్‌ - తిరుపతి ప్రజలకు తొలగని రహదారి సమస్య - Peddireddy Land Issues in Tirupati - PEDDIREDDY LAND ISSUES IN TIRUPATI

PeddiReddy Occupied Roads In Tirupati : జూన్‌ 4 వరకు ఆయనో సామంత రాజు ఆ రాజును కాదని చీమ కూడా అటువైపు వెళ్లేది కాదు. జూన్‌ 4తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో రాజరికం పోయి ప్రజాపాలన వచ్చింది. కానీ రాష్ట్రంలో కూటమి పాలన వచ్చినా ఆ సామంత రాజు అరాచకాలు మాత్రం ఆగలేదు. ప్రభుత్వమే కాదు, న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని సామంత రాజు నియంతృత్వంపై ఆదేశాలిచ్చినా వాటికే వక్రభాష్యం చెబుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

PeddiReddy Again Occupied Roads In Tirupati
PeddiReddy Again Occupied Roads In Tirupati (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 12:07 PM IST

PeddiReddy Again Occupied Roads In Tirupati :ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ పాలన పోయి చంద్రబాబు పరిపాలన ప్రారంభమై రెండునెలలైంది. అయినా ఆ మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు, వక్రబుద్ధి మాత్రం మారలేదు. తిరుపతిలోని ఇంటి ముందు ప్రజా రహదారికి రెండువైపులా గేట్లు పెట్టి ఐదేళ్ల అటువైపు ప్రజల రాకపోకలను అడ్డుకున్న పెద్దిరెడ్డికి ఆ గేట్లు తొలగించి రాకపోకలకు అవకాశం కల్పించాలని తాజాగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించింది. కానీ న్యాయస్థానం ఆదేశాలకు వక్రభాష్యం చెబుతూ సదరు సామంత రాజు పెద్దిరెడ్డి తాజాగా కొత్త కుట్రకు తెరలేపారు.

PeddiReddy Again Occupied Roads In Tirupati (ETV Bharat)

మళ్లీ అదే వైఖరి :కోర్టు తీర్పు మేరకు అధికారులు రెండు గేట్లు తెరిచారు. కానీ అధికారులు గేట్లు తెరిచిన కొద్ది సేపటికే ఆ రెండు గేట్ల మధ్యలో కార్యాలయం ముందు మరో కొత్త గేటు ఏర్పాటు చేసి తాళం వేశారు. ఇలా కొత్త గేటు ఏర్పాటు చేసి మళ్లీ రోడ్డుమీద రాకపోకలు సాగించే వీల్లేకుండా అడ్డుకుంటున్నారు. అధికారులు గేట్లు తెరిచారని రోడ్డులో కొంత దూరం వెళ్లాక తాళాలేసిన మరో గేటు ఉండటంతో ముందకు వెళ్లే అవకాశం లేక అటుగా వెళ్ళిన ప్రజలు వెనక్కి వచ్చేస్తున్నారు.

PeddiReddy Again Occupied Roads In Tirupati (ETV Bharat)

పట్టించుకోని నగరపాలక సంస్థ : ప్రభుత్వం, న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని నగరపాలక సంస్థ రహదారిపై రాకపోకలకు అవకాశం కల్పించినా ఆయన దుర్మార్గం మాత్రం ఆగలేదు. హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిన నగరపాలక సంస్థ అధికారులు కూడా ఈ విషయంలో నిద్ర నటిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఫోన్‌ చేసినా వారిలో స్పందన లేదని వారు వాపోతున్నారు.

atrocity case against minister: ఏపీ మంత్రి పెద్దిరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదుకు చిత్తూరు కోర్టు ఆదేశం

సిమెంట్‌ రోడ్డుకు పెద్దిరెడ్డి "గేట్‌ " : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రాయల్‌నగర్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసానికి 2019-2020లో కార్పొరేషన్‌ నిధుల నుంచి రూ.9.51 లక్షలు వెచ్చించి సిమెంటు రోడ్డు వేశారు. మారుతినగర్‌-రాయల్‌నగర్‌ ప్రజలు రాకపోకల సాగించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు.

రహదారి నిర్మాణం పూర్తయ్యాక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోడ్డుకు రెండువైపులా గేట్లు పెట్టి స్థానికుల రాకపోకలను అడ్డుకున్నారు. జనసేన నేతల ఫిర్యాదులో అధికారులు రహదారిపై పెట్టిన గేట్లు తొలగించేందుకు యత్నించారు. కానీ తమ ఇంటి వద్ద ఉన్న గేట్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. యథాతథ స్థితి పాటించాలని హైకోర్టు మొదట ఆదేశాలిచ్చింది.

అయితే నగరపాలక సంస్థ అధికారులు తాము రహదారిని ఎక్కడా ధ్వంసం చేయడం లేదని, గేట్లు తొలగించకుండా కేవలం ప్రజల రాకపోకలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు కోర్టుకు చెప్పారు. దీంతో రహదారిపై ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా గేట్లను తొలగించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. దీంతో అధికారులు గేటు తెరిచారు. అయితే మధ్యలో మరో గేటు ఏర్పాటుచేసి రాకపోకలు అడ్డుకోవడంతో ప్రజలకు మళ్లీ ఇబ్బందులు తప్పడం లేదు. కార్పొరేషన్‌ అధికారులు చర్యలు తీసుకుని కొత్త గేటును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

రోడ్డుపై పెద్దిరెడ్డి పెత్తనం - ప్రజలు తిరగకుండా గేట్లు - ap ex mini Peddireddy Occupied Road

"పెద్దాయన" ఇలాకాలో అరాచకం.. ప్రశ్నిస్తే కేసులు, దాడులు

ABOUT THE AUTHOR

...view details