ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో నీటిపై తేలియాడే రెస్టారెంట్ - ఒకేసారి 500 మందికి విందు - FLOATING RESTAURANT ON KRISHNA - FLOATING RESTAURANT ON KRISHNA

Tourism Development in AP 2024 : ఏపీలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సందర్శకులకు వినోదం అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడ వద్ద కృష్ణా నదిపై నీటిలో తేలియాడే రెస్టారెంట్​ను ఏర్పాటు చేయనుంది. ఒకేసారి 500 మంది పాల్గొనేందుకు వీలుగా దీనిని రూపొందించనున్నారు.

Floating Restaurant in Vijayawada
Floating Restaurant in Vijayawada (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 11:32 AM IST

Updated : Jul 10, 2024, 11:59 AM IST

Floating Restaurant in Vijayawada :గత వైఎస్సార్సీపీ సర్కార్ భ్రష్టుపట్టించిన పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం మొదలైంది. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు వినోదాన్ని అందించే ప్రాజెక్టులను వంద రోజుల్లో అందుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం రూ.100 కోట్లకు పైగా నిధులను వెచ్చించనున్నారు.

AP Govt Focus on Tourism Sector : ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు. పర్యాటకులు అత్యధికంగా సందర్శించే విశాఖపట్నం, అరకు, విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కాకినాడ, దిండి, సూర్యలంక తదితర ప్రాంతాల్లో, రానున్న మూడు నెలల్లో వివిధ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. నదులు, సువిశాలమైన తీర ప్రాంతంలో వినోద సంబంధిత సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ప్రాజెక్టుల వివరాలివే :

  • ఏపీలో మొదటిసారి విజయవాడ వద్ద కృష్ణా నదిలో నీటిపై తేలియాడే రెస్టారెంట్‌ అందుబాటులోకి రానుంది.
  • 500 మంది ఒకేసారి పాల్గొనేందుకు వీలుగా దీనిని రూపొందించనున్నారు.
  • ఇదే తరహా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ను రాజమహేంద్రవరంలో గోదావరి నదిపై ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు.
  • విశాఖపట్నం, కాకినాడ, సూర్యలంక బీచ్‌లలో క్లాంపింగ్, గ్లాంపింగ్‌ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు.
  • బీచ్‌ ఒడ్డున ఇసుకలో రిసార్ట్స్‌ ఏర్పాటు చేయనున్నారు.
  • విశాఖలోని అరకు, తొట్లకొండ, హార్సిలీహిల్స్‌లో కారవాన్‌ పర్యాటకం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
  • ఈ మూడు ప్రాంతాల్లో రాత్రివేళల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కారవాన్లలో బస చేసేందుకు వీలుగా వీటిలో అన్ని సదుపాయాలు కల్పించనున్నారు.
  • విశాఖ-రుషికొండలో అడ్వెంచర్‌, విజయవాడలో బెర్మ్‌ పార్క్ పర్యాటకంలో భాగంగా 3 స్పీడ్‌ బోట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం, సూర్యలంక వాటర్‌ స్పోర్ట్స్‌లో భాగంలో 5 జెస్కీలు ఏర్పాటు చేస్తారు.
  • విజయవాడలో బెర్మ్‌ పార్కు నుంచి ఇబ్రహీంపట్నం, పోచమ్మగండి నుంచి పోలవరం-భద్రాచలం మధ్య డబుల్‌ డెక్కర్‌ లగ్జరీ బోట్లను ప్రవేశపెట్టేందుకు ప్రైవేట్ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కోనసీమ బ్యాక్‌ వాటర్‌లో సింగిల్‌ బెడ్‌ రూం లగ్జరీ హౌస్‌ బోటు, విజయవాడలో మరో వీఐపీ బోటు ఏర్పాటు చేయనున్నారు.
  • విశాఖపట్నం నుంచి చెన్నై, చెన్నై నుంచి భువనేశ్వర్, భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా తీరం మీదుగా పర్యాటకుల కోసం ప్రత్యేకంగా క్రూయిజ్‌నౌకను ప్రవేశపెట్టనున్నారు.
  • అరకులో ట్రెక్కింగ్, బంగీ జంపింగ్, రాక్‌ క్లైంబింగ్, పారాగ్లైడింగ్, మోటార్‌ బైక్‌ టూరింగ్‌ వంటివి ఏర్పాటు చేస్తారు.
  • చంద్రగిరి కోట వద్ద సౌండ్, లైట్‌ షో, విజయవాడలో బెర్మ్‌ పార్కు నుంచి భవానీ ఐలాండ్, పోలవరం నుంచి పట్టిసీమ మధ్య తీగల వంతెన, విజయవాడలోని భవానీ ద్వీపంలో థీం, వాటర్‌ పార్కు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

తిరుమలలో ఏపీటీడీసీ హోటళ్లను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్‌ - Kandula Durgesh Inaugurated Hotels

Yanam Tourism: యానాంలో పర్యాటకుల సందడి.. వేసవి తాపం నుంచి ఉపశమనానికి

Last Updated : Jul 10, 2024, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details