ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిర్మించని గృహాలన్నీ రద్దు - ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్‌ ఆమోదం

ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం

AP_Cabinet_Meeting
AP Cabinet Meeting (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2024, 3:28 PM IST

Updated : Dec 3, 2024, 5:42 PM IST

AP CABINET MEETING: కేబినెట్​ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్​లో చర్చించగా, గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి అవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో అసలు నిర్మించని గృహాలను రద్దు చేసే అంశంపైనా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పు చేర్పులపై చర్చించడంతో పాటు ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ​లో ఆమోదం తెలిపారు.

డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు ప్రతిపాదనపైనా చర్చించారు. ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ పాలసీ 4.0పై చర్చించి ఆమోదించారు. ఏపీ టెక్స్‌టైల్స్‌ గార్మెంట్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీలకు కూడా కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది.

రేషన్​ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు - మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

Minister Partha Sarathy on Cabinet Decisions: కేబినెట్​ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకి వెల్లడించారు. దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మార్చేలా కొన్ని విధానాలకు ఆమోదం కేబినెట్ తెలిపిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఐటీ, గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలియజేసిందన్నారు. వర్కింగ్ స్పేస్, కో వర్కింగ్ స్పేస్, మానవ వనరుల అభివృద్ధికి ఈ విధానం తోడ్పడుతుందని, కో వర్కింగ్ స్పేస్​లు అభివృద్ధి చేసే పెట్టుబడులకు ఈ పాలసీ తోడ్పాటు అందిస్తోందని చెప్పారు.

కో వర్కింగ్ స్టేషన్​లతో పాటు మాల్స్, వాణిజ్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. తిరుపతి, విశాఖ లాంటి ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా వీటికి అవకాశం ఉందని తెలిపారు. వర్క్ స్టేషన్​లలో ఒక్కో సీట్ కోసం 2 వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఈ పాలసీ రూపకల్పన చేసినట్లు వివరించారు. ఐటీ క్యాంపస్​లో వర్కింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

పీపీపీ విధానంలో ఐదు టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటు: ఏపీ గార్మెంట్స్, అపారెల్ పాలసీ 2024-29 కి కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. 10 వేల కోట్ల పెట్టుబడులు సాధించేలా గార్మెంట్ పాలసీ రూపొందించామన్నారు. ఒక బిలియన్ డాలర్లు ఎగుమతి సాధించేలా నిర్ణయం తీసుకున్నామని, పీపీపీ విధానంలో 5 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయడం ఈ విధానం లక్ష్యమని స్పష్టం చేశారు. వివిధ కేటగిరీల వారీగా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందన్నారు. ఏపీ మారిటైమ్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. తీరంలో పోర్టులు, అనుబంధ పరిశ్రమలు వచ్చేలా ఈ కొత్త పాలసీ తోడ్పడుతుందని వివరించారు.

అమరావతికి కొత్త కళ - రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు

మెగా షిప్ యార్డు నిర్మాణం: ఏపీలో 180 మిలియన్ టన్నులు కార్గో మాత్రమే ఎగుమతి అవుతోందన్నారు. షిప్ బిల్డింగ్​లోనూ ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఒక మెగా షిప్ యార్డు నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. గత ప్రభుత్వం విధ్వంసకర నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. మాజీ సీఎం నియోజకవర్గం పులివెందులతో పాటు డోన్ నియోజకవర్గాల్లో తాగునీటి వసతి కోసం నీటి ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో 6.41 లక్షల ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలలో 1.90 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం ఆమోదం తెలిపిందన్నారు. ఏపీ పర్యాటక పాలసీ 2024-29కి ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈవీ పాలసీకి కూడా ఆమోదం తెలిపిందని, 30 వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం కల్పించేలా పాలసీ రూపొందించామన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ 4.0 అమలుకు ఆమోదం తెలిపామన్నారు. వాట్సాప్ ద్వారా పౌర సేవలు ఇచ్చేలా ఆర్టీజీఎస్ 4.0 అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

అమరావతి పనులకు మంత్రివర్గం ఆమోదం:రాజధాని అమరావతిలో 11వేల 471 కోట్లతో పనులు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. గత ప్రభుత్వం మూడుముక్కలాట ఆడటంతో పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాల్సి రావడంతో 2 వేల 507 కోట్ల అదనపు భారం పడిందని మంత్రి నారాయణ తెలిపారు. అన్నింటినీ సరిచేసుకుని వచ్చే మూడేళ్లలో రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

'కఠిన నిర్ణయాలు తీసుకోవాలి' - సీఎం చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌

Last Updated : Dec 3, 2024, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details