Minister Gummadi Sandhya Rani Escort Constable Gun Magazine Missing : రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనంలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ మ్యాగజైన్ కనిపించకుండా పోయింది. కానిస్టేబుల్ జి.వి రమణ హ్యాండ్ బ్యాగ్ తో పాటు 30 బులెట్లు ఉన్న గన్ మ్యాగజైన్ పోయినట్లు గుర్తించారు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని విజయనగరం వచ్చిన కానిస్టేబుల్ హ్యాండ్ బ్యాగ్ కనిపించకుండా పోగా, అందులో 30 బులెట్లు ఉన్న గన్ మ్యాగజైన్ ఉండటం పోలీసుశాఖలో కలకలం రేపింది. తన వద్ద ఉన్న రైఫిల్ని మన్యం జిల్లా కేంద్రంలో అప్పగించిన కానిస్టేబుల్, బుల్లెట్స్ మ్యాగజైన్ మాత్రం అప్పగించలేదు.
30 బుల్లెట్ల గన్ మ్యాగ్జైన్ మాయం : వ్యక్తిగత పనిమీద బుధవారం సాయంత్రం విజయనగరం వచ్చిన రమణ, కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఆటో దిగి డ్యాకుమెంట్ రైటర్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో పక్కన పెట్టిన చేతిసంచి కనిపించ లేదు. అందులో 30 బులెట్లు ఉన్న గన్ మ్యాగజైన్ ఉండటంతో విజయనగరం ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి కానిస్టేబుల్ను విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 30 తూటాలతో కూడిన మ్యాగజైన్ పోయిన విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, దర్యాప్తు చేపట్టినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలియచేశారు.
అతడు నా గన్‌మెన్ కాదు : బుల్లెట్ల బ్యాగ్ మిస్ చేసుకున్న కానిస్టేబుల్ తన గన్‌మెన్ కాదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టంచేశారు. ఎస్కార్ట్ వాహనంతో వచ్చిన కానిస్టేబుల్ అని అతను బ్యాగు మిస్ చేసుకున్నాడని వివరించారు. ఎస్కార్ట్ సిబ్బంది రోజూ మారుతుంటారన్నారు. తన గన్‌మెన్ బుల్లెట్టు ఉన్న బ్యాగ్ మిస్ అయిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు.
బ్యాగులో బుల్లెట్లు - విమానాశ్రయానికి విద్యార్థి - ఏం జరిగిందంటే?
ఇంటెలిజెన్స్ అధికారి 30 బుల్లెట్ల మ్యాగజైన్ మాయం.. ఎక్కడంటే?