MLA Somireddy Attended Nellore Railway Court : నెల్లూరు రైల్వే కోర్టుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అనుమతి లేకుండా వెబ్ పోర్టల్‌లో కరోనా మందు అమ్మకానికి పెట్టడంపై అప్పట్లో సోమిరెడ్డి ప్రశ్నించారు. దీంతో శీశ్రీత టెక్నాలజీ CEO నర్మదరెడ్డి సోమిరెడ్డిపై కేసు పెట్టారు. మాజీ మంత్రి కాకాణి ప్రోద్బలంతో తనపై కేసు పెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు.
చాల కేసులు ఉన్నాయి, భయపడను : నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ పాలనలో అనేక కేసులు పెట్టారని, అందులో ఇది కూడా ఒక వేధింపుల కేసు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది విమర్శించారు. కాకాణి గోవర్ధన్ రెడ్ది పుణ్యమా అని కోర్టులో నిలబడ్డానని చెప్పారు. ఇలాంటి చాల కేసులు ఉన్నాయని, భయపడను అని స్పష్టం చేశారు. తనపై నిత్యం నిరాధార ఆరోపణలు చేయడమే కాకాణికి అలవాటు అయిపోయిందని మండిపడ్డారు.
ఆస్తుల విలువ ఎలా పెరిగాయి : 2016లో చేసిన ఆరోపణలకు ఇంత వరకు ఆధారాలు చూపించలేదన్నారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ఉంటే ఒక రోజు ముందు 15న కోట్లు విలువ చేసే భూములను అర్ధరాత్రి కాకాణి అల్లుడికి ఇప్పించారని తెలిపారు. మంత్రిగా ఉన్నా తను రైతులకు సహాయ పడ్డానని, కాకాణి దోపిడీ చేసిన భూములను తిరిగి రైతులకు ఇప్పించానని చెప్పారు. 2019, 2024లో డమ్మీగా నామినేషన్ వేసిన కాకాణి కుమార్తెల అఫిడవిట్ ఆస్తుల విలువ ఎలా పెరిగిందని సోమిరెడ్డి నిలదీశారు.
'జగన్ అలిగి ఇంట్లో కూర్చుంటే కుదరదు - చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి'