Group 2 candidates Appeal To APPSC :వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించబోయే ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కోరుతున్నారు. సిలబస్ మార్పులు, పూర్తిస్థాయిలో సన్నద్ధత కోసం మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల అభ్యర్థన, ఆందోళన దృష్ట్యా ఏపీపీఎస్సీ సానుకూల నిర్ణయం తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు సైతం కోరారు. గ్రూప్-2 ప్రధాన పరీక్ష గడువు పెంపుపై సానుకూలంగా స్పందించిన ఏపీపీఎస్సీ, డీఎస్సీ తేదీల ప్రకటనల ఆధారంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష తేదీలపై నిర్ణయం తీసుకోనుంది.
APPSC Groups Mains Exam Issue :సర్కారు కొలువు సాధించాలన్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవిత లక్ష్యాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నీరుగార్చింది. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి అధికారపీఠమెక్కిన వైఎస్ జగన్ కీలకమైన గ్రూప్-1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాలను పక్కన పెట్టారు. లక్షల మంది నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగడం వల్ల గతేడాది డిసెంబర్ 7న హడావుడిగా 897 ఉద్యోగాల భర్తీకి మాత్రమే ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది.
సిలబస్‌లో మార్పులు చేసి గ్రూప్స్ అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమయ్యే సమయం ఇవ్వకుండా ఆగమేఘాలపై నియామక ప్రక్రియ చేపట్టింది. గ్రూప్-2కు 4లక్షల 83వేల 535 మంది అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 4 లక్షల 4 వేల 37మంది హాజరయ్యారు. వారిలో 92వేల 250మంది మాత్రమే ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు.