ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Live Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా - AP Assembly Sessions 2024

AP Assembly Sessions 2024
AP Assembly Sessions 2024 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 9:07 AM IST

Updated : Jul 22, 2024, 10:45 AM IST

AP Assembly Sessions 2024 Live Updates: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. దాదాపు 5 రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రభుత్వం 3 శ్వేత పత్రాలను విడుదల చేయనుంది. అదే విధంగా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తూ, ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సర్కార్‌ సిద్ధమైంది. మరో 3 నెలలకు ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.

LIVE FEED

10:37 AM, 22 Jul 2024 (IST)

రాష్ట్ర విభజన వల్ల ప్రతికూల ప్రభావం పడింది: గవర్నర్‌

  • ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం లక్షా 6 వేల 176 కోట్లు: గవర్నర్‌
  • విభజిత ఏపీలో తలసరి ఆదాయం 93 వేల 121 కోట్లకు పడిపోయింది: గవర్నర్‌
  • రాష్ట్ర విభజన వల్ల ప్రతికూల ప్రభావం పడింది: గవర్నర్‌
  • అపరిష్కృత సమస్యల వల్ల సవాళ్లు వచ్చాయి: గవర్నర్‌
  • విభజన వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని చంద్రబాబు ప్రభుత్వం అవకాశంగా మలచుకుంది: గవర్నర్‌
  • సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ప్రభుత్వం పునాది వేసింది: గవర్నర్‌
  • సముద్ర తీరం, నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది: గవర్నర్‌
  • తయారీ కార్యకలాపాలకు అవసరమైన వాతావరణంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది: గవర్నర్‌
  • 2014-19 మధ్య కాలంలో అభివృద్ధి, సంక్షేమం మధ్య స్పష్టమైన సమతుల్యం ఉంది: గవర్నర్‌
  • గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో పట్టిసీమ రికార్డు సమయంలో పూర్తయింది: గవర్నర్‌
  • ఏడాది సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ పూర్తిచేసింది: గవర్నర్‌
  • చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయింది: గవర్నర్‌
  • ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు: గవర్నర్‌
  • కరవు నివారణ చర్యలు, రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ చేపట్టారు: గవర్నర్‌
  • భూసేకరణ ద్వారా అమరావతి ప్రాంత అభివృద్ధి చేశారు: గవర్నర్‌
  • కొత్త సచివాలయం, శాసనసభ భవన నిర్మాణం చేశారు: గవర్నర్‌
  • చంద్రబాబు దూరదృష్టి నాయకత్వం వల్లే 2014-19 మధ్య అభివృద్ధి సాధ్యమైంది: గవర్నర్‌

10:31 AM, 22 Jul 2024 (IST)

ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయి: గవర్నర్‌

  • విభజన చట్టం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదు: గవర్నర్‌
  • ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయి: గవర్నర్‌
  • అశాస్త్రీయ విభజన వల్ల 46 శాతం వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయి: గవర్నర్‌
  • రాజధాని హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగింది: గవర్నర్‌
  • ఉన్నత విద్యాసంస్థలు కోల్పోయాం: గవర్నర్‌
  • భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చింది: గవర్నర్‌
  • ప్రాంతం ఆధారంగా ఆస్తులు.. వినియోగం ఆధారంగా విద్యుత్‌ పంపిణీ చేశారు: గవర్నర్‌
  • ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యాసంస్థలు విభజించారు: గవర్నర్‌

10:28 AM, 22 Jul 2024 (IST)

మార్పు కావాలని ప్రజలు ఆకాంక్షించారు: గవర్నర్‌

  • ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు: గవర్నర్‌
  • మార్పు కావాలని ప్రజలు ఆకాంక్షించారు: గవర్నర్‌
  • ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉంది: గవర్నర్‌
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయంగా విడదీశారు: గవర్నర్‌
  • భాగస్వాములతో చర్చలు చేయకుండా విభజించారు: గవర్నర్‌
  • ఉమ్మడి ఏపీ విభజన రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాయని మచ్చగా మిగిలింది: గవర్నర్‌
  • రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ వల్ల అల్లకల్లోలం ఏర్పడింది: గవర్నర్‌
  • రాష్ట్ర ప్రజలు సుదీర్ఘకాలం అభివృద్ధి పురోగతికి నోచుకోలేదు: గవర్నర్‌

10:21 AM, 22 Jul 2024 (IST)

2019 నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి: గవర్నర్‌

  • శాసనసభ సమావేశాలు ప్రారంభం
  • ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం
  • కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు: గవర్నర్‌
  • కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు: గవర్నర్‌
  • విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం ఏర్పడింది: గవర్నర్‌
  • ఆంధ్రప్రదేశ్‌ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: గవర్నర్‌
  • చంద్రబాబు విజనరీ నాయకుడు: గవర్నర్‌
  • 2014లో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషిచేశారు: గవర్నర్‌
  • 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగింది: గవర్నర్‌
  • అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి: గవర్నర్‌
  • రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషిచేశారు: గవర్నర్‌
  • ఆ తర్వాత 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది: గవర్నర్‌
  • 2019 నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి: గవర్నర్‌
  • చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి మళ్లారు: గవర్నర్‌
  • 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లింది: గవర్నర్‌

10:12 AM, 22 Jul 2024 (IST)

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం

  • శాసనసభ సమావేశాలు ప్రారంభం
  • ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం
  • కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు: గవర్నర్‌
  • కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు: గవర్నర్‌
  • ఆంధ్రప్రదేశ్‌ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: గవర్నర్‌
  • విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం ఏర్పడింది: గవర్నర్‌
  • రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయాం: గవర్నర్‌
గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం (ETV Bharat)

10:12 AM, 22 Jul 2024 (IST)

గవర్నర్‌ ప్రసంగానికి అంతరాయం కలిగిస్తున్న వైఎస్సార్సీపీ సభ్యులు

శాసనసభ సమావేశాలు ప్రారంభం

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం

గవర్నర్‌ ప్రసంగానికి అంతరాయం కలిగిస్తున్న వైఎస్సార్సీపీ సభ్యులు

10:09 AM, 22 Jul 2024 (IST)

శాసనసభ సమావేశాలు ప్రారంభం

శాసనసభ సమావేశాలు ప్రారంభం

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (ETV Bharat)

9:58 AM, 22 Jul 2024 (IST)

అసెంబ్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

  • అసెంబ్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • కాసేపట్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం
  • ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌
  • గవర్నర్‌ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం
  • అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్న బీఏసీ
చంద్రబాబు (ETV Bharat)

9:36 AM, 22 Jul 2024 (IST)

వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు

  • అమరావతి: వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు
  • ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాళులు
  • చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన రాజధాని రైతులు, వెంకటపాలెం గ్రామస్థులు
  • ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి బయల్దేరిన సీఎం చంద్రబాబు
  • ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు
  • ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌
  • గవర్నర్‌ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం
  • అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్న బీఏసీ
ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు (ETV Bharat)

9:03 AM, 22 Jul 2024 (IST)

జగన్ వాహనం అసెంబ్లీ గేటు లోపలకి అనుమతించాలని నిర్ణయం

  • జగన్ వాహనం అసెంబ్లీ గేటు లోపలకి అనుమతించాలని నిర్ణయం
  • గేట్ నెంబర్ 4 బయటే కారు దిగి లోనికి వెళ్లాల్సి ఉన్న ఎమ్మెల్యేలు
  • ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనం అనుమతికి నిర్ణయం
  • వైఎసస్సార్సీపీ శాసనసభాపక్ష విన్నపం మేరకు నిర్ణయం

9:00 AM, 22 Jul 2024 (IST)

ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు

  • నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
  • ఉదయం వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నేతల నివాళులు
  • నివాళుల అనంతరం అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో రావాలని టీడీఎల్పీ సూచన
  • ఇవాళ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు
  • ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
  • గవర్నర్‌ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం
  • అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్న బీఏసీ
  • ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం
  • నెలాఖరుతో ముగియనున్న ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్ గడువు
  • మరో 3 నెలలకు ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం
  • అక్టోబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం
  • 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం
  • వైఎస్సార్సీపీ పాలనపై ఇప్పటికే 4 శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం
  • మరో మూడు శ్వేతపత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సీఎం
  • శాంతిభద్రతలు, మద్యం, ఆర్థికశాఖల అంశాలపై సభలో చర్చ
Last Updated : Jul 22, 2024, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details