Ambedkar Jayanthi Celebrations 2024 :రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికిగవర్నర్ రాధాకృష్ణన్ సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రితో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆచార్య కోదండరామ్ తదితరులు అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి అంజలి ఘటించారు.
హక్కులే సర్వస్వం.. సమన్యాయం కోసం అలుపెరగని పోరాటం
Ambedkar Jayanthi Celebrations in Telangana :ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని(Ambedkar Bronze Statue) ఏర్పాటు చేస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దపెల్లి జిల్లా మంథనిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
BR Ambedkar Jayanthi in BRS Party Office :అంబేద్కర్ జయంతి సందర్బంగా సంగారెడ్డి పాత బస్టాండు వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి మాజీమంత్రి హరీశ్‌రావు పూలమాల వేసి నివాళలర్పించారు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజలారా మేల్కొండి - వాళ్ల కుట్రలను అర్థం చేసుకోండి : కేటీఆర్ - Ambedkar Jayanthi Celebrations