Allu Arjun Meets Megastar Chiranjeevi in Jubileehills : తెలుగు చలన చిత్ర మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) పుష్ప- 2 నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) కుటుంబ సమేతంగా ఆదివారం(డిసెంబరు 15న) తన ఇంటికి వెళ్లి కలిశారు. స్వయంగా తన రేంజ్‌రోవర్ కారును నడుపుకుంటూ చిరంజీవి ఇంటికెళ్లిన బన్నీ సుమారు గంట సమయం పాటు అక్కడే గడిపారు. తాజా పరిణామాలపై బన్నీ మెగాస్టార్‌తో చర్చించారు. ఈనెల 4(బుధవారం రాత్రి)న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందింది.
అరెస్ట్.. రిమాండ్.. బెయిల్ : రేవతి కుమారుడు సైతం తీవ్ర గాయాలై ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఆ ఘటనపై అల్లు అర్జున్‌ను ఏ(Acused)-11 నిందితుడిగా చేర్చిన పోలీసులు శుక్రవారం (డిసెంబరు 13)న అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పర్చారు. వెంటనే విచారణ చేపట్టిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు ఆయన్ను వెంటనే చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మొదటిసారి చిరుమామ దగ్గరికే : అదే రోజు తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ తరఫున లాయర్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా విచారించిన న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసింది. అయినా అల్లు అర్జున్ మరుసటి రోజు విడుదలయ్యారు. అల్లుఅర్జున్ అరెస్టయిన వెంటనే చిరంజీవి దంపతులు బన్నీ నివాసానికి చేరుకొని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికెళ్లడం చర్చనీయాంశంగా మారింది.