Allu Arjun Remand :పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగాహైదరాబాద్లోనిసంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు సినీ హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అల్లు అర్జున్ను చంచల్‌గూడ జెలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలు వద్ద సౌత్‌ఈస్ట్ జోన్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంతకుముందు అల్లు అర్జున్‌కు గాంధీ ఆసుపత్రిలో కొవిడ్‌తో పాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, రోగుల సహాయకులు వైద్య విద్యార్థులు ఎగబడ్డారు. సెల్ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీస్తూ ఆయనను కలిసేందుకు ఆసక్తి కనబరిచారు. అనంతరం అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టుకు తరలించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు.