Raft Competitions in Nellore: సంక్రాంతి అంటేనే సంబురం. ఈ పండగ మూడు రోజులు చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఈ పండగకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రజలు స్వగ్రామాలకు చేరుకుంటారు. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతుంటారు.
ఈ పండగ కోసం రకరకాల పోటీలు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానమైనవి కోడిపందేలు. ఈ పందేల్లో ఇప్పటివరకు కోట్ల రూపాయలు చేతులు మారాయి. అయితే కోడిపందేలు కాకుండా ఇతర పందేలు కూడా నిర్వహించారు. కొన్నిచోట్ల పందుల పందేలు, పొట్టేలు పందేలు చేపట్టారు. ఇక రాయలసీమ జిల్లాల్లో ఎద్దుల పందేలు లాంటివి నిర్వహించారు.
ఈసారి ప్రభుత్వం టూరిజం అభివృద్ధిలో భాగంగా ఆత్రేయపురంలో పడప పోటీలు నిర్వహించాయి. కేరళకు మాత్రమే పరిమితమైన ఈ పోటీలు చేపట్టగా ఎంతోమంది ఆసక్తి కనబరిచారు. ఇకపై కూడా ఈ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే తరహాలో నెల్లూరు నగరంలో తెప్పల పోటీలు నిర్వహించారు.
సంక్రాంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలో నిర్వహించిన తెప్పల పోటీలు ఉత్సాహంగా సాగాయి. పొదలకూరు రోడ్డులోని లేక్యూ కాలనీ వద్ద నెల్లూరు చెరువులో ఈ పోటీలను నిర్వహించారు. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పోటీలను ప్రారంభించారు. దాదాపు 30 మంది స్థానిక మత్స్యకారులు పోటీలో పాల్గొన్నారు. నిర్ణీత దూరం వెళ్లి మొదట వచ్చిన ముగ్గురికి నిర్వాహుకులు నగదు బహుమతులు అందజేశారు.
సంక్రాంతి సంబరాలు - రసవత్తరంగా పందుల పోటీలు