Akarshana Sathish Republic Day Delhi 2024: హైదరాబాద్కు చెందిన ఆకర్షణ సతీశ్ దిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందుకుంది. ఈ మేరకు భారత రక్షణ శాఖ ప్రత్యేక ఆహ్వానం పంపింది. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆకర్షణ ఏడో తరగతి చదువుతంది. పేద విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందించాలనే సదుద్దేశంతో, మూడేళ్లుగా పుస్తకాలు సేకరించి గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎంఎన్‌జే ఆసుపత్రి సహా జైళ్లు, పోలీస్‌స్టేషన్ల వంటి ప్రాంతాల్లో ఇప్పటి వరకు తొమ్మిది లైబ్రరీలను ఏర్పాటు చేసింది.
Akarshana SathishInvited to Republic Day Delhi 2024 :ఆకర్షణ సతీశ్ (Akarshana Sathish) కృషిని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆ అమ్మాయిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీన దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో (Republic Day Delhi 2024) పాల్గొనాలని భారత రక్షణ శాఖ ఆహ్వానించింది. ఈ ఆహ్వానం అందడం పట్ల ఆకర్షణ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారత్-పాక్ సరిహద్దులో 'బీటింగ్ రీట్రీట్' వేడుకలు
Republic Day celebrations in Delhi :గణతంత్ర దినోత్సవానికి దేశవ్యాప్తంగా 13,500 మంది ప్రత్యేక అతిథులను కేంద్రం ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ నుంచి 151, ఆంధ్రప్రదేశ్ నుంచి 203 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని మొత్తం 18 శాఖల నుంచి వివిధ రూపాల్లో లబ్ధి పొందినవారు, ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని ఇందుకోసం ఎంపిక చేశారు. వీరిలో ఉత్తమ పనితీరు కనబరిచిన సర్పంచులు, స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాల ప్రతినిధులున్నారు. అలాగే వరుసగా రెండోసారి కూడా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారిని ఆహ్వానించారు.