Air Asia Has Announced an Offer to Fly From Hyderabad to Bangkok :థాయ్ ఎయిరేషియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.7,390, చెన్నై నుంచి ఫుకెట్‌కు రూ.6,990కే ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే వైజాగ్ సహా దేశంలోని 12 నగరాలకు థాయ్‌ల్యాండ్ నుంచి విమాన సర్వీసులు నిర్వహిస్తున్న ఈ సంస్థ, కొత్తగా హైదరాబాద్ - బ్యాంకాక్ సర్వీసులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అక్టోబరు 27 నుంచి హైదరాబాద్ - బ్యాంకాక్ సర్వీస్, చెన్నై - ఫుకెట్ సర్వీసును అక్టోబరు 30 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
ప్రారంభ ఆఫర్ కింద ఈ నెల 22 వరకు రాయితీ టికెట్లు ఎయిరేషియా.కామ్, ఎయిరేషియా మూవ్ యాప్‌పై విక్రయిస్తామని థాయ్ ఎయిరేషియా వాణిజ్య విభాగాధిపతి తన్సిత గురువారం చెప్పారు. హైదరాబాద్ - బ్యాంకాక్ మధ్య 2024 అక్టోబరు 27 నుంచి 2025 మార్చి 29 వరకు, చెన్నై - ఫుకెట్ మధ్య 2024 అక్టోబరు 30వ తేదీ నుంచి 2025 మార్చి 29 మధ్య ప్రయాణానికి వీటిని కొనుగోలు చేసుకోవాలని సూచించారు. భారత ప్రయాణికులు థాయ్‌ల్యాండ్ వచ్చేందుకు వీసా అవసరం లేదని, పాస్‌పోర్టు ఉంటే సరిపోతుందని చెప్పారు.
Hyderabad Bengalore Vande Bharat Express Ticket Price : హైదరాబాద్ టు బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్‌మ్యాప్, టికెట్ రేట్లు ఇవే
99కే హైదరాబాద్ టు బెంగళూరు : ఏసీ బస్సులో మన రాష్ట్రంలోని పట్టణాలకు వెళ్లాలంటేనే ప్రయాణ ఖర్చులు తడిసి మోపడవుతున్న నేటి సమయంలో, ఇక అంతర్రాష్ట్ర సర్వీసులు హైదరాబాద్ - బెంగళూరు అంటే ఖర్చుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఫ్లిక్స్ బస్ సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రూ.99కే హైదరాబాద్ - బెంగళూరు మధ్య ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.
ప్రయాణికులకు అందుబాటు ఛార్జీలతో, స్థిరమైన రవాణాకు అంతర్జాతీయ బ్రాండ్‌గా ఉన్న ఫ్లిక్స్‌బస్ దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. బెంగళూరు నుంచి 33 నగరాలకు బస్ సర్వీసులు ప్రారంభిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా రూ.99తో టికెట్ బుక్ చేసుకునే ఆఫర్‌ను సంస్థ ప్రకటించింది. ఈ నెల 3-15 మధ్య టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ప్రయాణ తేదీలు సెప్టెంబరు 11 నుంచి అక్టోబరు 6 మధ్య ఉండాలని తెలిపారు.
ఆర్టీసీ టికెట్ల రేట్లు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు- సీఎం నిర్ణయమే ఫైనల్!
ఇదెక్కడి లెక్కరా సామి - బస్సు మళ్లింపులకు సైతం మా దగ్గరే వసూలా? - Bus Ticket Extra Price Collected