తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యూ ఇయర్​ నుంచి 'ఏఐ కోర్సులు' - 14 వేల విద్యాసంస్థలకు ఏఐసీటీఈ లేఖ - AI COURSES IN SYLLABUS EDUCATIONAL

ఇంజినీరింగ్, వృత్తి విద్యా కోర్సుల సిలబస్‌లో ఏఐ కోర్సులు - చేర్పులు, మార్పులపై 14 వేల విద్యాసంస్థలకు ఏఐసీటీఈ లేఖ

AI courses in Syllabus Of Educational
AI courses in Syllabus Of Educational Courses (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2024, 2:03 PM IST

2025 Year of AI : భవిష్యత్తును కృత్రిమ మేధ ఏఐ నడిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్​ను ఈ అంశంలో విశ్వగురువుగా మార్చాలన్న లక్ష్యంతో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 2025ను కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించింది. ఇంజినీరింగ్, మేనేజ్​మెంట్, పాలిటెక్నిక్ తదితర కోర్సుల్లో ఏఐ కోర్సును పెట్టి విద్యార్థులను ఆ రంగంలో నిపుణులుగా మార్చాలని నిర్ణయించింది. అందుకు ప్రాథమికంగా పలు చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది.

ఏఐ సంవత్సరంగా 2025 : ఈ నెలాఖరులోపు ఏఐ అమలు ప్రణాళికను సమర్పించాలని దేశవ్యాప్తంగా తన పరిధిలోని దాదాపు 14 వేల విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లు ఏఐసీటీఈ చైర్మన్ టీజీ సీతారామ్ లేఖ రాశారు. అంతేకాదు వచ్చే విద్యా సంవత్సరానికి అనుమతులు ఇచ్చే సమయంలో ఆయా కళాశాలలు సమర్పించిన ప్రణాళికను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఏఐలో ఉత్తమ పనితీరు కనబరిచే కశాశాలలకు పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహిస్తారు.

  • అందరికీ ఏఐ పేరిట విద్యాసంస్థల ప్రాంగణాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. అందుకు పలు రకాల కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. ఏఐసీటీఈ సూచించిన కార్యక్రమాలు.
  • కార్యశాలలు, నిపుణుల ప్రసంగాలు, హ్యాకథాన్లు నిర్వహణ. విద్యార్థులు కలిసి నేర్చుకోవడం, ఏఐలో ఆవిష్కరణలు. కళాశాలల్లో ఏఐ ల్యాబ్‌లు నెలకొల్పడం. విద్యార్థులకు ఏఐ రంగంలో కౌన్సెలింగ్‌ నిర్వహించడం
  • అన్ని బ్రాంచీల్లో ఏఐ పాఠ్యాంశాలను చేర్చడం జరుగుతుంది. ప్రాథమిక అంశాలతో పాటు అడ్వాన్స్‌డ్‌ ఏఐ పాఠ్యాంశాలను చేర్చి సిలబస్‌ను ఉన్నతీకరించాలని ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది.
  • అధ్యాపకులను కూడా దీని బోధనలో నిపుణులుగా మార్చేందుకు కార్యశాలను నిర్వహిస్తారు. దీనిపై పనిచేసే సంస్థల్లో ప్రస్తుతం ఏం జరుగుతుందో విద్యార్థులకు తెలియాలి. దీనికోసం పరిశ్రమలతో భాగస్వామ్యం కలిగి ఉండాలి. అందుకు వాటిల్లో ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు చేయచ్చు.

ABOUT THE AUTHOR

...view details