Minister Atchannaidu on Bird Flu:బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బర్డ్ ఫ్లూ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని 5 పౌల్ట్రీ ఫార్మ్‌లో మాత్రమే సోకిందని వెల్లడించారు. బయో సెక్యూరిటీ జోన్లుగా ఈ ప్రాంతాల్ని ప్రకటించామని తెలిపారు.
బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్‌లకు పంపించామని అన్నారు. బర్డ్ ఫ్లూ అంశాలపై దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహిరిస్తామని మంత్రి హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎప్పటికపుడు పరిస్థితిని సమీక్ష చేస్తున్నామన్నారు. తెలంగాణ నుంచి వచ్చే కోళ్లను ఏపీకి రాకుండా నిలిపి వేసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా కిలోమీటరు పరిధిలోని ప్రాంతాన్ని సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించామని తెలిపారు.
మనుషులకు సోకిన దాఖలాలు లేవు:బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల ప్రజలు ఆందోళ చెందాల్సిన అవసరం లేదని పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు అన్నారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకిన దాఖలాలు లేవన్నారు. విదేశాల నుంచి వలస వచ్చిన పక్షుల వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు వెల్లడించారు. ఈ సాయంత్రానికి బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను చంపి పూడ్చిపెడతామన్నారు. ఒక్కో కోడికి గానూ రైతుకు 140 రూపాయలు పరిహారం చెల్లిస్తామని వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం- రెండు రోజుల్లోనే 11 వేల కోళ్లు మృతి