Hero Manchu Manoj Joined Hospital :సినీ హీరో మంచు మనోజ్ గాయపడ్డారు. ఆయన కాలికి గాయమవ్వడంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం వచ్చారు. ఆస్పత్రి డాక్టర్లు మనోజ్‌కు పరీక్షలు నిర్వహించారు. మంచు మనోజ్ వెంట సతీమణి మౌనిక కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న మీడియా వర్గాలు ఆస్పత్రికి చేరుకుని మనోజ్‌ను ప్రశ్నించగా, ఇరువురూ స్పందించలేదు. నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ మనోజ్ ఆస్పత్రి వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
హీరో మంచు మనోజ్ కాలికి గాయం - చికిత్స కోసం బంజారాహిల్స్ హాస్పిటల్‌కు - MANCHU MANOJ JOINED HOSPITAL
కాలికి గాయం కావడంతో బంజారాహిల్స్ ఆసుపత్రికి వచ్చిన మంచు మనోజ్ - మంచు మనోజ్‌తో పాటు ఆసుపత్రికి సతీమణి మౌనిక
Published : Dec 8, 2024, 6:59 PM IST
ఆస్తుల విషయంలో మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్ మధ్య గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారంటూ ఇవాళ(ఆదివారం) ఉదయం వార్తలు వచ్చాయి. మంచు మనోజ్ గాయాలతో వచ్చి మరీ ఫిర్యాదు చేశారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు ఫ్యామిలీ స్పందించింది. అసత్య ప్రచారాలు చేయవద్దంటూ ఆ వార్తా కథనాలు రాసిన మీడియాకు సూచించింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మనోజ్ కాలి గాయంతో హాస్పిటల్‌కు రావడంతో అటు ఇండస్ట్రీలో, ఇటు మీడియాలోనూ మరోసారి చర్చనీయాంశమైంది. మరోవైపు మోహన్‌బాబు, మనోజ్‌లు పరస్పరం ఒకరిపై ఒకరు డయల్ 100కు ఫోన్ చేసి కంప్లైంట్ చేశారని పోలీసులు చెప్పడం గమనార్హం. ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఇరువురికీ సూచించామని పోలీసులు తెలిపారు.