ACB Raids On Green Co Company In Madhapur : ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో గతంలో స్పాన్సర్‌గా ఉన్న గ్రీన్‌కో అనుబంధ సంస్థల్లో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే మాదాపూర్‌లోని ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలకు దిగింది. దీంతో పాటు విజయవాడ, మచిలీపట్నంలోనూ తనిఖీలు చేపట్టింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఒప్పంద పత్రాలు, లావాదేవీలు సహా ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.
గ్రీన్‌కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు : తమకు నష్టం జరిగిందంటూ ఫార్ములా ఈ రేసు నుంచి గ్రీన్‌కో తప్పుకుంది. అయితే ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ స్పాన్సర్‌షిప్ నుంచి అర్ధాంతరంగా గ్రీన్‌కో అనుబంధ సంస్థలు వైదొలిగినప్పుడు అందుకు కారణాలపై సంబంధిత సంస్థను ప్రభుత్వం ప్రశ్నించాలి. అవసరమైతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాలి. కానీ అప్పటి ప్రభుత్వం ఇవేమీ చేయకపోగా తానే రేసు నిర్వహణ బాధ్యతను తీసుకుంది. ఈ క్రమంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలపై ఏసీబీ ఆరా తీస్తుంది.