ACB Raids On AE Nikesh Residence :అవినీతి నిరోధక శాఖకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నీటి పారుదల శాఖ ఏఈ నిఖేశ్‌కు సంబంధించి రూ.150 కోట్లకు పైగా ఆస్తులను అధికారులు గుర్తించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి నిఖేశ్ బంధువులతో పాటు సన్నిహితుల ఇళ్లలో కలిపి 30 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. నిఖేశ్ పేరిట పలు ఫామ్‌హౌజ్‌లు, వ్యవసాయ భూములు, ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు ఉన్నట్లు గుర్తించారు.
ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం - ఏఈ ఇంట్లో రూ.150 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం - ACB RAIDS ON AE NIKESH RESIDENCE
నీటి పారుదల శాఖ ఏఈ నిఖేశ్ నివాసంలో ఏసీబీ సోదాలు - రూ.150 కోట్ల వరకు ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు
![ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం - ఏఈ ఇంట్లో రూ.150 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం ACB Raids On AE Nikesh Residence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-11-2024/1200-675-23013504-thumbnail-16x9-acb-raids-on-aee-house.jpg)
ACB Raids On AE Nikesh Residence (ETV Bharat)
Published : Nov 30, 2024, 5:30 PM IST
ఇందులో మూడు ఫాంహౌజ్‌ల విలువే రూ.80 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏఈ నిఖేశ్ గతంలో పట్టుబడ్డాడు. ఒక అనుమతి కోసం దరఖాస్తుదారుడి నుంచి రూ.2,50,000 డిమాండ్ చేసి, ఈఈ బన్సీలాల్, మరో ఏఈ కార్తీక్‌తో కలిసి నిఖేశ్ ఏసీబీకి చిక్కాడు. అప్పటి నుంచి నిఖేశ్ సస్పెన్షన్‌లో ఉన్నాడు.