ACB Court Allows CM Revanth Reddy Foreign Trip :తెలంగాణసీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. ఈనెల జనవరి 13వ తేదీ నుంచి 23 వరకు సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిస్బేన్, దావోస్ దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉందని సీఎం ఏసీబీ కోర్టును కోరారు. ఈ అంశాన్ని పరిశీలించిన న్యాయస్థానం, రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది.
గతంలో ఓటుకు నోటు కేసు బెయిల్ సందర్భంగా పాస్‌పోర్టును సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు అప్పగించారు. ప్రస్తుతం విదేశాలకు వెళ్లాల్సి ఉందని తన పాస్‌పోర్టును 6 నెలలు ఇవ్వాలనే సీఎం అభ్యర్థనకు కూడా ఏసీబీ కోర్టు అంగీకారం తెలిపింది. తిరిగి 2025 జులై 6వ తేదీ లోపు పాస్‌పోర్టు తిరిగి అప్పగించాలని రేవంత్‌రెడ్డిని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ఆస్ట్రేలియా పర్యటన రద్ధు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియా పర్యటన పూర్తిగా రద్దయ్యింది. ఈ నెల 14న సీఎం దిల్లీ వెళ్లనున్నారు. 15, 16 తేదీల్లో దిల్లీలో పర్యటించనున్నారు. 15వ తేదిన దేశ రాజధాని దిల్లీలో జరగనున్న ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.