తెలంగాణ

telangana

ETV Bharat / state

జమ్మూ నుంచి వచ్చి యువతిపై ప్రేమోన్మాది దాడి - అలాంటివి తనకు ఇష్టం లేదన్నందుకే - WOMAN ATTACKED IN VISAKHAPATNAM

యువతిపై ప్రేమోన్మాది దాడి - ప్రేమించడం లేదని ఘాతుకం - జమ్మూ నుంచి వచ్చి విశాఖలో దాడి

A Young Woman Was Attacked by Youth in Visakhapatnam
A Young Woman Was Attacked by Youth in Visakhapatnam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2024, 2:12 PM IST

A Young Woman Was Attacked by Youth in Visakhapatnam : తన ప్రేమను అంగీకరించడం లేదని కక్షగట్టిన ఓ ప్రేమోన్మాది జమ్మూ నుంచి విశాఖ వచ్చి యువతిపై దాడి చేసిన ఘటన విశాఖ జిల్లా గాజువాకలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గాజువాక బాలచెరువు కాలనీలో గురువారం జరిగిన ఈ దారుణంపై న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా ఉండే మేఘన డిగ్రీ పూర్తి చేసింది. ప్రజాపిత బ్రహ్మకుమారీస్‌ సంస్థ సేవా కార్యక్రమాల్లో భాగంగా గతేడాది రాజస్థాన్‌లోని మౌంట్‌ అబుకు వెళ్లింది. అక్కడ ఆమెకు జ్వరం రావడంతో సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందింది. జమ్మూలోని ఉద్ధంపూర్‌కు చెందిన నీరజ్‌ వర్మ కూడా అదే సమయంలో అక్కడే చికిత్స పొందాడు.

ఈ క్రమంలో మేఘనతో నీరజ్‌ వర్మ పరిచడం పెంచుకున్నాడు. సేవ ముగించుకుని ఇంటికొచ్చిన మేఘనకు నీరజ్‌ తరచూ ఫోన్‌ చేస్తూ ఆరోగ్యం గురించి అడుగుతూ ఫొటోలు పంపించేవాడు. తనకు ఇలాంటివి ఇష్టం లేదని చెప్పినా, తన పాత వీడియోలు, అశ్లీల చిత్రాలు పంపించి మేఘనను వేధించాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు న్యూపోర్టు పోలీసులకు, సైబర్‌ క్రైం విభాగంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు నీరజ్‌ వర్మకు ఫోన్‌ చేసి హెచ్చరించారు.

'నా లవ్​ను ఎందుకు యాక్సెప్ట్​ చేయట్లేదు' : పరీక్షలు రాసేందుకు వచ్చిన యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి

గురువారం రోజున మేఘన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసుకొని, నీరజ్‌ హెల్మెట్‌ ధరించి వచ్చి నేరుగా ఆమె గదిలోకి వెళ్లాడు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. తల, భుజం, చేతులపై విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో పక్కన ఉంటున్న సాయికృష్ణ రాగా, అతనిపైనా దాడి చేశాడు. నిందితుడు నీరజ్‌ పారిపోతుండగా, అదే ప్రాంతానికి చెందిన హోంగార్డు అతన్ని పట్టుకోడానికి ప్రయత్నించినా అతను దొరకలేదు.

తలకు 31 కుట్లు :బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, ఆమెను పరిశీలించిన డాక్టర్లు తలపై 31 కుట్లు వేశారు. చేతి చూపుడు వేలు పూర్తిగా తెగిపోయింది. రెండు మోచేతులు ఛిద్రమయ్యాయి. జోన్‌-2 డీసీపీ మేరీ ప్రశాంతి, హార్బర్‌ ఏసీపీ కాళిదాస్, న్యూపోర్టు సీఐ దాలిబాబు ఆసుపత్రికి వచ్చి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. నీరజ్‌ రెండు రోజుల క్రితమే జమ్మూ నుంచి విశాఖకు వచ్చి, రెక్కీ నిర్వహించి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మైనర్ బాలికను చాకుతో పొడిచిన ప్రేమోన్మాది - అడ్డొచ్చినా తల్లిదండ్రుల పైనా దాడి - Murder Attempt on Minor Girl

LB Nagar Sanghavi Health Condition Update : ప్రేమోన్మాది దాడి ఘటన.. జీవితాంతం సంఘవి మందులు వాడాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details