A Student Suicide in Hyderabad :యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని విద్యా నగర్‌కు చెందిన హాసిని(19) అనే యువతి విద్యార్థిని ఇంట్లో ఉరేసుకొని నిన్న(నవంబర్ 17)న సాయత్రం ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు చావుకు కారణం నిఖిల్ అనే యువకుడి వేధింపుల వల్ల తన కూతురు ఆత్మహత్య చేసుకుందని యువతి తండ్రి సతీష్ ఆరోపణ చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నిఖిల్ అనే యువకుడే కారణం?: భువనగిరి పట్టణానికి చెందిన హాసిని హైదరాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లి కసుర్భా కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. కాగా భువనగిరి పట్టణానికి చెందిన యువకుడు నిఖిల్ తనను ఫోన్లో పలు రకాలుగా వేధింపులకు గురి చేశాడని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, తీవ్రమైన దుర్భాషలాడుతూ మాట్లాడాడని, తమ వద్ద ఆధారాలున్నాయని మృతురాలి తండ్రి సతీష్ ఆరోపించారు.
తన కూతురును వేధించినట్లు ఫోన్లో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ రికార్డును మీడియాకి సైతం ఇచ్చారు. నిన్న (నవంబర్ 17) ఆదివారం సాయత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగా స్పందించలేదని హాసిని తండ్రి సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితున్ని పట్టుకుని, రిమాండ్ చేసే వరకు తన కూతురికి పోస్ట్‌మార్టం చేయవద్దని ఆయన డిమాండ్ చేశారు.
శనివారం సతీష్ తన బావమరిదికి అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వచ్చినట్లు చెప్పారు. ఆరోజు అక్కడే ఉండి మరుసటి రోజున తన ఇంటికి (భువనగిరిలోని విద్యానగర్) బయలుదేరినట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తన కూతురు హాసినితో ఫోన్లో మాట్లాడానని అన్నారు. ఇంతలోనే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఘట్కేసర్ వద్ద ఉండగా తన కూతురి మరణ వార్త తెలిసిందని బాధాతృప్త హృదయంతో విలపించారు. వెంటనే వెళ్లి చూసేసరికి గదిలో ఊరి వేసుకుని చనిపోయిందని చెప్పారు. దీనికి కారణమైన యువకుడు నిఖిల్‌ని రిమాండ్ తరలించి తమకు న్యాయం చేయాలని మీడియాతో వాపోయారు.
పెన్ను కోసం గొడవ - భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
వివాహమైన నెల నుంచే వేధింపులు - సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్