తెలంగాణ

telangana

ETV Bharat / state

పాతకక్షలతో ఓ కుటుంబంపై గొడ్డలితో యువకుడి దాడి - గ్రామంలో పోలీసు పికెటింగ్ - person who attacked a family - PERSON WHO ATTACKED A FAMILY

Man Attacked On Family With Axe : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఓ గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో ఓ కుటుంబంపై వ్యక్తి గడ్డపార, గొడ్డలితో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. దీంతో ఆ కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెటింగ్​ ఏర్పాటు చేశారు.

Man Attacked On Family With Axe
Man Attacked On Family With Axe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 8:07 PM IST

Man Attacked On Family With Axe :జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు అనే గ్రామంలో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఉద్రిక్త వాతవరణానికి దారితీసింది. గ్రామానికి చెందిన కల్లెం తిరుపతి అనే యువకుడు మరో కుటుంబంపై గడ్డపార, గొడ్డలితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఓ వివాదానికి సంబంధించి తనను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి బాధితకుటుంబమే కారణమని భావించిన సదరు వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే :స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం గొల్లపల్లి మండలం గుంజపడుగు అనే గ్రామంలో కల్లెం తిరుపతి అనే వ్యక్తి కుటుంబానికి గందం సిద్దు కుటుంబానికి మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఆ పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. గతంలో ఓ విషయంలో పోలీసులతో తిరుపతి వివాదానికి దిగాడు. దీంతో అతడిని పోలీస్​స్టేషన్​కు తరలించి చర్యలు తీసుకున్నారు. దీనికి ప్రత్యర్థులే కారణమని భావించిన తిరుపతి వారిపై పగ పెంచుకున్నడని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గందం సిద్దు, సమ్మయ్య, కుమార్‌, అనిల్‌, శారదపై గడ్డపార, గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆ ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

ముషీరాబాద్‌లో హోటల్ వద్ద యువకుల మధ్య ఘర్షణ - వీడియో వైరల్ - Street Fight In Hyderabad

గ్రామంలో పోలీసు పికెటింగ్​ :ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు దాడికి పాల్పడ్డ తిరుపతి ఇంటిపై లూటి చేసి దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దాడి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తిరుపతి ఇంటివద్ద పికెటింగ్​ ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బాధితులకు ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. తమ కుటుంబంపై ముప్పై మంది దాడికి పాల్పడినట్లుగా బాధితులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఖమ్మం జిల్లాలో గిరిజనుల మధ్య భూ వివాదం - అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై దాడి - people attack on police

వైన్​షాప్ వద్ద మందుబాబుల వీరంగం - తప్పతాగి మహిళపై దాడి - Drunk Men Attack on Woman Video

ABOUT THE AUTHOR

...view details