A Man Killed his Own Brother-in-Law in Rangareddy District :పరామర్శించేందుకు వచ్చిన సొంత బామ్మర్దినే బావ హ్యత చేసిన ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. అనంతరం విషయం తెలుసుకున్న బాధితుని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ప్రతీకారంగా బావను అంతమొందించారు. దీంతో ఒకే రోజే రెండు హత్యలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నాగిళ్ల గ్రామంలో చోటు చేసుకుంది.
బామ్మర్దిపై గొడ్డలితో దాడి : స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి 10 సంవత్సరాల క్రితం తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి గతేడాది విడుదలయ్యాడు. తాజాగా ఆదివారం నాగిళ్లలో ఓ వివాహం జరగగా, ఆ వివాహ వేడుకలో పాల్గొనేందుకు యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన గడ్డం శ్రీను (యాదయ్య భార్య తమ్ముడు) వచ్చారు. అనంతరం అదే గ్రామంలో ఉన్న తన బావ (యాదయ్య)ను పరామర్శించేందుకు అతని ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో యాదయ్య శ్రీనుపై గొడ్డలితో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.