తెలంగాణ

telangana

ETV Bharat / state

అయ్యో పాపం : ఆకలిగా ఉందని బజ్జీల బండి వద్ద 'గుడ్డు' తిన్నాడు - ప్రాణం తీస్తుందని ఊహించలేక'పోయాడు' - A MAN DIED EGG STUCK IN THROAT

బజ్జీల బండి వద్ద ఉడకబెట్టిన కోడి గుడ్డు తింటుండగా అది గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి - నాగర్​కర్నూల్​ జిల్లాలో ఘటన - మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు

Egg Stuck In Throat
A Man Dies Egg Stuck In Throat (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 7:19 AM IST

Updated : Nov 4, 2024, 7:34 AM IST

A Man Dies Egg Stuck In Throat: రోజూ ఎక్కడో ఒక చోట విచిత్రమైన మరణ వార్తలు వింటుంటాం. మనం తినే ఆహారం కూడా ఒక్కోసారి మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఇలాంటి ఘటనలు చాలా చూస్తున్నాం. మాంసం ముక్క గొంతులో ఇరక్కొని మరణించాడని, దోస తింటుండగా గొంతులో ఇరుక్కొని, కొబ్బరి ముక్క ఇరుక్కొని ప్రాణాలు పోయిన వార్తలూ సోషల్ మీడియాలో వైరల్​గా మారుతుంటాయి. అయితే చావు, పుట్టుకలు మన చేతుల్లో ఉండవు. మృత్యువు సమీపించే వేళైతే ఎవరూ ఆపలేరు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, భద్రంగా ఉన్నామని భావించినా, నాకేం అవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉన్నా, చావు దగ్గరైతే తప్పించుకోలేరంటారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఇలాంటి ఓ ఘటనే జరిగింది. ఉడకబెట్టిన కోడి గుడ్డు గొంతులో ఇరుక్కుని ఒక వ్యక్తి మృతి చెందాడు.

ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం : బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్‌ గ్రామానికి చెందిన తిరుపతయ్య (60) లింగాలలో ఉన్న బంధువు ఇంటికి వచ్చారు. అప్పాయిపల్లిలో ఉన్న మరో బంధువు ఇంటికి వెళ్లడానికి లింగాల రామాలయం కమాన్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఓ బజ్జీల బండి వద్ద ఆగాడు. బండి వద్ద ఉడకబెట్టిన కోడి గుడ్డు తింటుండగా అది గొంతులో ఇరుక్కుంది. దీంతో తిరుపతయ్యకు ఊపిరాడలేదు. గమనించిన స్థానికులు నీళ్లు తాగిస్తుండగా, ఆయన మరణించారు. పోలీసులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Last Updated : Nov 4, 2024, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details