A Man Died After Falling in Water Sump in Hyderabad :చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇంట్లో నీటి సంపును తెరిచి ఉంచటంతో ప్రమాదవశాత్తు యువకుడు పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి ఖలీల్ కుమారుడు అక్మల్ సుఫియాన్ ఖమ్మంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శిక్షణ నిమిత్తం అక్మల్‌ను కంపెనీ వారు హైదరాబాద్‌కు పంపించి, గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండేందుకు నివాసం ఏర్పాటు చేశారు. ఉదయం వ్యాయామశాలకు వెళ్లిన అతను అరటిపండ్లు కొనుక్కుని ఫ్లాట్‌కు బయలుదేరాడు. అప్పటికే, ఇంటి యజమాని ఆవరణలో ఉన్న సంపులో మోటార్ వేసి, ఇంట్లోకి వెళ్లిపోయాడు.