Husband Kills Wife And Daughter :కట్టుకున్న భార్య, కుమార్తెపైనే అతి కర్కశంగా ప్రవర్తించి దారుణ హత్యకు ఒడిగట్టాడు ఓ భర్త. అనంతరం తాను కూడా రైల్వే ట్రాక్పైపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఏసీపీ గోపాలకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గణేశ్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా భార్య, కుమార్తెలతో కలిసి బోయిన్పల్లి ఆర్య సమాజం వద్ద ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గణేశ్ కుటుంబ పోషణ రీత్యా ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే చక్కగా సాగుతున్న వారి సంసారంలో అభిప్రాయబేధాలు వచ్చాయి. భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి భార్య స్వప్న, 10 నెలల చిన్నారి నక్షత్రను గణేశ్ గొంతునులిమి చంపేశాడు.
ఒకే కుటుంబంలో ముగ్గురి మరణంతో విషాదఛాయలు :భార్య, కుమార్తెను చంపిన అనంతరం సుచిత్ర రైల్వే ట్రాక్‌పై గణేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే భార్యపై అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురి మరణంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిడికి మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. తల్లి, తండ్రీ మరణంతో వారు అనాథలయ్యారు.