418 Kidney Stones Removed in a Patient : ఓ వ్యక్తి కిడ్నీ నుంచి ఏకంగా 418 వరకు రాళ్లను వైద్యులు బయటకు తీశారు. 60 ఏళ్ల వయసున్న వ్యక్తి కిడ్నీ దెబ్బతినడంతో తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ సోమాజిగూడలోని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రిలో (ఏఐఎన్‌యూ) చేరాడు. వివిధ పరీక్షల తర్వాత అతని మూత్రపిండాల్లో పెద్ద సంఖ్యలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సర్జరీ చేయాలని వైద్యులు డాక్టర్ కె.పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్ గోపాల్, డాక్టర్ దినేష్ బృందం నిర్ణయం తీసుకుంది.
418 Kidney Stones Removed inHyderabad :ఈ క్రమంలోనే పెర్క్యుటేనియస్ నెఫ్రోలితోటమీ (పీసీఎన్‌ఎల్) విధానంలో మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో ఎలాంటి కోత లేకుండా అతనికి ఆపరేషన్ చేశారు. చిన్న చిన్న రంధ్రాలతో లోపలకు సూక్ష్మ కెమెరాను, లేజర్ ప్రోబ్‌లను పంపి రాళ్లను బయటకు తీశారు. దాదాపు 418 రాళ్లను బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం అతడి కిడ్నీ (Kidney Stones) పనితీరు మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేశామని పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు రెండు గంటల సమయం పట్టిందని వైద్యులు వివరించారు.
ఈ వంటింటి చిట్కాతో కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్!
How to Prevent Kidney Stones :కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు తగినంత నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు ఉండేటట్లు చూసుకోవాలని పేర్కొంటున్నారు. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, నారింజ పండ్లను తినాలని అంటున్నారు. అలాగే ద్రాక్ష, బొప్పాయి వంటి వాటిని కూడా తీసుకుంటూ ఉండాలని వివరిస్తున్నారు. పాలకూర, బీట్‌రూట్ వంటి ఆహార పదార్థాలను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు తెలియజేస్తున్నారు.