ETV Bharat / sports

అప్పుడు సచిన్​, కాంబ్లీ - ఇప్పుడు యశస్వి, పృథ్వీ షా! - YASHASVI JAISWAL VS PRITHVI SHAW

ప్రస్తుత తరంలో సచిన్ తరహాలో యశస్వి - కాంబ్లీని పోలిన కథతో పృథ్వీ షా!

Yashasvi Jaiswal VS Prithvi Shaw
Yashasvi Jaiswal VS Prithvi Shaw (source ANI)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 28, 2024, 7:31 AM IST

Yashasvi Jaiswal VS Prithvi Shaw : 'ప్రతిభ కన్నా క్రమశిక్షణ ముఖ్యం' - ఇది ప్రతీ వ్యక్తికి ఉండాల్సిన మొదటి లక్షణం. అప్పుడే ఏ రంగంలోనైనా రాణించి ఉన్నత స్థాయికి ఎదగగలం. ఇదే మాటను క్రికెట్​లో దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​ పృథ్వీ షాకు చెప్పాడు. సచిన్‌ అప్పట్లో ఆ మాటను తనతో ఎందుకు అన్నాడో ఇప్పుడు పృథ్వీకి బాగా అర్థమయ్యే ఉండాలి.

ఎందుకంటే పృథ్వీ ప్రతిభ ఎలాంటిదో క్రికెట్ ఫ్యాన్స్​కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెహ్వాగ్‌ స్టైల్​లో కాలు కదపకుండా సూపర్​ టైమింగ్‌తో బంతిని బౌండరీకి పంపగలడు. మైదానం నలుమూలలా షాట్లు బాదగలిగే సత్తా అతడిది. అతడు క్రీజులో కుదురుకున్నాడంటే బౌలర్లకు చుక్కలే. కానీ ఇప్పుడతడి పరిస్థితి అలా లేదు. టీనేజీలోనే వచ్చిన పేరు ప్రఖ్యాతులు, డబ్బు అతడిని నిలవనీయలేదేమో! ఆట మీద శ్రద్ధ తగ్గి, శరీరం మీద పట్టు తప్పింది. ఫలితంగా వేగంగానే అతడి కెరీర్‌ పతనమైపోయింది. ప్రస్తుత ఐపీఎల్​లోనూ అతడిని ఎవరూ ఆసక్తి చూపని స్థాయికి పడిపోయింది. కాబట్టి, ఇంకా చెప్పాలంటే సచిన్‌కు ఏమాత్రం తీసిపోనివాడే అయినా, సచిన్‌కున్న క్రమశిక్షణ, పట్టుదల లేక అప్పట్లో వినోద్‌ కాంబ్లీ ఏమయ్యాడో తెలుసు కదా? అతడిని పోలిన కథే ఇప్పుడు పృథ్వీ షాది!

యశస్వి అలా చేయలేదు! - కానీ పృథ్వీ షాతో పాటు వచ్చిన యశస్వి జైస్వాల్‌ అలా కాదు. సచిన్​ 'ప్రతిభ కన్నా క్రమశిక్షణ ముఖ్యం' మంత్రం యశస్వి బాగా వంటబట్టించుకున్నాడు! వాస్తవానికి పృథ్వీ షాలాగానే యశస్విది సామాన్య నేపథ్యమే. షా తరహాలోనే ఎంతో కష్టపడ్డాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన అతడు, పదేళ్ల వయసులో క్రికెట్‌ పిచ్చితో ఇంటి నుంచి పారిపోయి ముంబయికి వెళ్లి కష్టపడ్డాడు. శ్రమ, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలను విడిచిపెట్టకుండా ముందుకు సాగాడు.

ముంబయి తరఫున దేశవాళీ క్రికెట్లో అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ సత్తా చాటి, ఐపీఎల్‌లోనూ అవకాశం అందుకున్నాడు. అక్కడ కూడా అద్భుతంగా రాణించి టీమ్‌ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే కీర్తి, డబ్బు అతడి ఏకాగ్రతను అస్సలు దెబ్బ తీయలేకపోయాయి. వెస్టిండీస్‌తో తన అరంగేట్రానికి ముందు, అలానే ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన కఠిన సిరీస్‌ ముంగిట, ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలోనూ అతను ఎంతగానే కష్టపడ్డాడు, ఇంకా కష్టపడుతున్నాడు.

ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌ నేపథ్యంలోనూ యశస్వి రెండు రోజుల పాటు కాంక్రీట్‌ పిచ్‌పై, సింథటిక్‌ బంతులతో, రెండు రోజుల వ్యవధిలోనే 200 ఓవర్లు సాధన చేశాడంటే తన పట్టుదల ఎలాంటిదో చెప్పొచ్చు. కాబట్టి ఎంత ప్రతిభ ఉన్నా, నిరంతర సాధన మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో ఎదగడానికి తోడ్పడుతుందనే సచిన్‌ మాటను అక్షరాలా పాటిస్తున్న ఆటగాడు యశస్వి.

పృథ్వీ షా కెరీర్​ అలా చేజారే! - స్కూల్​ క్రికెట్​లోనే ఏకంగా 546 పరుగుల మారథాన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టి వెలుగులోకి వచ్చాడు పృథ్వీ షా. అప్పుడు నుంచి ఎదుగుతూనే వచ్చాడు. తొలి రంజీ మ్యాచ్‌లో శతకం, తొలి దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లోనే సెంచరీ, ఇలా పరుగుల వరద పారించేవాడు. తన కెప్టెన్సీలోనే భారత జట్టు అండర్‌-19 వరల్డ్​ కప్​ను కూడా ముద్దాడింది. 18 ఏళ్లకే టీమ్ ఇండియా టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ బాది సచిన్‌ తర్వాత అత్యంత పిన్న వయసులోనే అరంగ్రేట మ్యాచ్‌లో సెంచరీ బాదిన క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు.

జూనియర్‌ స్థాయి నుంచి మాస్టర్​ బ్లాస్టర్​ రికార్డులు బ్రేక్ చేస్తూ, మరో సచిన్ అవుతాడని ప్రశంసలు అందుకున్నాడు. కానీ మొదట్లో పడ్డ కష్టం, సాధన, చూపించిన పట్టుదలను తర్వాత కొనసాగించలేకపోయాడు. క్రమశిక్షణతో మెలిగలేకపోయాడు. ఫిట్‌నెస్‌ సమస్యలతోనూ టీమ్‌ఇండియాకు దూరమవ్వాల్సి వచ్చింది. తర్వాత ఫామ్‌ కూడా దెబ్బ తింది. విపరీతంగా బరువు పెరిగిపోయాడు. పార్టీలు పబ్బుల్లో మునిగి తేలడం, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో గొడవ, డోపింగ్‌ నిబంధనల్ని అతిక్రమించడం వంటివి చేసి బీసీసీఐ నిషేధానికి గురి అయ్యాడు. ముంబయి క్రికెట్‌ సంఘం కూడా అతడి క్రమశిక్షణ రాహిత్యానికి విసిగిపోయి రంజీ జట్టు నుంచి తప్పించింది. ఐపీఎల్‌లోనూ దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకోలేకపోయాడు. అందుకే ఈసారి వేలంలో ఎవ్వరూ అతడిని కొనలేదు.

రూ. 27 కోట్లు కాదు! - ఐపీఎల్ రెమ్యూనరేషన్​లో పంత్​కు వ‌చ్చేది ఎంతంటే?

వేలంలో అమ్ముడైన తెలుగు కుర్రాళ్లు వీరే - వాళ్ల గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.